Mahesh Babu : నేటి తరం స్టార్ డైరెక్టర్స్ లో మాస్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శ్రీను. మాస్ మహారాజ రవితేజ ‘భద్ర’ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన బోయపాటి, ఆ తర్వాత తులసి, సింహా,లెజెండ్, సరైనోడు, అఖండ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. బోయపాటి శ్రీను సినిమాల్లో నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్ అని సోషల్ మీడియా లో ఒక కామెంట్ ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది.

రీసెంట్ గా ఆయన దర్శకత్వం లో, రామ్ హీరో గా నటించిన ‘స్కంద’ చిత్రం సోషల్ మీడియా లో ఏ రేంజ్ నెగటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఓవర్ మాస్ సన్నివేశాలు అర్థం పర్థం లేని కథనం ఇవన్నీ ప్రేక్షకులకు చిరాకు పుట్టించాయి. ఇకపోతే ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ ఇంటర్వ్యూ లో సోషల్ మీడియా లో వచ్చే నెగటివ్ కామెంట్స్ పై అలాగే భవిష్యత్తులో తానూ చెయ్యబోయే సినిమాలపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. యాంకర్ మహేష్ బాబు తో సినిమా ఉంటుంది అని అప్పట్లో అన్నారు కదా ఏమైంది అని బోయపాటి ని అడగగా, మహేష్ బాబు గారిని కలిసి ఒకసారి కథ చెప్పాను, ఆయన నచ్చారు, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ కావాలి అన్నారు.

ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తోనే వెళ్లాను, మొత్తం విన్న తర్వాత అంతా బాగానే ఉంది కానీ, ఇంత ఓవర్ యాక్షన్ తో కూడిన హింస మరియు ఫైట్స్ అవసరమా?, న్యాచురల్ గా ప్లాన్ చెయ్యొచ్చు కదా అన్నారు. అందుకే ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. కానీ ఆయన అభిరుచి కి తగ్గట్టుగానే కొత్త స్క్రిప్ట్ తో త్వరలోనే ఆయన దగ్గరకి వెళ్తాను. కచ్చితంగా మా కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.