Mahesh Babu కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా మనం చిన్నతనం లో ఉన్నప్పుడు తెగ నచేస్తూ ఉంటాయి.అలాంటి సినిమాల్లో ఒకటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘టక్కరి దొంగ’ చిత్రం.నాల్గవ సినిమాతోనే కౌ బాయ్ గెటప్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో చేసిన సాహసాలు పిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి.అప్పట్లో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, టీవీలలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి TRP రేటింగ్స్ వస్తుంటాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన లిసా రాయ్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.ఈమె టాలీవుడ్ లో కేవలం ఈ ఒక్క సినిమాలోనే హీరోయిన్ గా నటించింది, ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ మరియు సౌత్ ఇండియన్ సినిమాలోనూ కనిపించలేదు.ఈమె అధిక శాతం హిందీ , మరియు ఇంగ్లీష్ లోనే నటిస్తూ వచ్చింది.

లిసా రాయ్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగం లో దిగ్గజం లాగ రాణించింది.ఆ తర్వాత ఈమె పలు యాడ్స్ లోను మరియు మ్యూజిక్ వీడియోస్ ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకుంది.అలా డైరెక్టర్స్ దృష్టిలో పడిన ఈమెకి తొలి సినిమా అవకాశం తమిళం లో దక్కింది.శరత్ కుమార్ హీరో గా నటించిన నేతాజీ అనే చిత్రం ద్వారా ఈమె వెండితెర కి పరిచయం అయ్యింది.ఆ తర్వాత కన్నడ లో పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ మూవీ రీమేక్ ‘యువరాజా’ లో హీరోయిన్ గా నటించింది.

ఇందులో శివరాజ్ కుమార్ హీరో గా నటించాడు.ఇక ఆ తర్వాత ఆమెకి ఏకంగా బాలీవుడ్ నుండి ఆఫర్స్ తలుపు తట్టింది.అలా ఆమె సినీ కెరీర్ కొనసాగుతూ వచ్చింది.అయితే లీసా రాయ్ కి సంబంధించిన లేటెస్ట్ హాట్ ఫోటోలు కుర్రకారులను పిచ్చేక్కిన్చేస్తున్నాయి.50 ఏళ్ళ వయస్సు లో కూడా నేటి తరం కుర్ర హీరోయిన్స్ తో పోటీపడే రేంజ్ అందం ని మైంటైన్ చేస్తూ ఆమె అప్లోడ్ చేసిన కొన్ని బికినీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి.

