Mahesh Babu : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ అనే చిత్రం. త్రివిక్రమ్ తో కలిసి మహేష్ బాబు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ అనేక ఒడిదుడుగులను ఎదురుకొని ఎట్టకేలకు షూటింగ్ ని తిరిగి ప్రారంభించుకుంది. ఏ ముహూర్తం లో షూటింగ్ ప్రారంభించారో తెలియదు కానీ, ఈ సినిమా నుండి ఒక్కొక్కరిగా తప్పుకుంటూ పోయారు. అభిమానులకు అసలు ఏమి జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి.

ఔట్పుట్ బాగా వస్తున్నట్టు లేదు, సినిమా ఆగిపోతే బాగుండును అని అభిమానులు సోషల్ మీడియా లో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు ఔట్పుట్ విషయం లో ఎక్కడా కూడా తగ్గడం లేదని, అందుకే షూటింగ్స్ లో ఇన్ని మార్పులు జరిగాయని, చివరికి ది బెస్ట్ ఔట్పుట్ వస్తుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదే కనుక జరిగితే తెలుగు రాష్ట్రాల్లో రాజమౌళి రికార్డ్స్ ని బద్దలు కొట్టిన మొట్టమొదటి హీరో గా మహేష్ బాబు చరిత్ర సృష్టిస్తాడు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఆరు ఎకరాల్లో గత కొద్దీ రోజుల క్రితమే ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో ఇంటర్వెల్ ఫైట్ ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా ఈ ఇంటర్వెల్ ఫైట్ ని ఆరు రోజులు ప్లాన్ చేసారు. కానీ మహేష్ బాబు కేవలం మూడు రోజుల్లోనే ఈ ఫైట్ సీక్వెన్స్ ని పూర్తి చేసి మూవీ యూనిట్ మొత్తాన్ని షాక్ కి గురి చేసాడు.ఇంత జెట్ స్పీడ్ లో షూటింగ్ ని జరుపుతున్నారు అంటే కచ్చితంగా ఈ సినిమాని సంక్రాంతికి దిమ్పాలని కసి మహేష్ బాబు లో బలంగా కనిపిస్తుంది.

ఈ సంక్రాంతికి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా తప్ప మరో పెద్ద హీరో సినిమా పోటీకి లేదు. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పోటీకి వస్తుంది అనుకున్నారు కానీ, షూటింగ్ ఆ సమయానికి పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు, కాబట్టి ఈ సంక్రాంతి మహేష్ బాబు కి సోలో గా దొరికినట్టే అని చెప్పొచ్చు. చూడాలిమరి ఆయన ఈసారి ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ ని కొట్టబోతున్నాడు అనేది.