Murari Re-Release : మన టాలీవుడ్ లో రీ రిలీజ్, స్పెషల్ షోస్ ట్రెండ్ గ్రాండ్ గా మొదలైంది పోకిరి సినిమా నుండి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ముందుగా ఈ ట్రెండ్ కి భీజం వేసింది గబ్బర్ సింగ్ చిత్రం. అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు గబ్బర్ సింగ్ చిత్రాన్ని కొన్ని ఎంచుకున్న ప్రాంతాలలో స్పెషల్ షో వేసి గ్రాండ్ సక్సెస్ చేసారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని చూసి మహేష్ బాబు అభిమానులు దూకుడు చిత్రాన్ని కొన్ని చోట్ల స్పెషల్ షోస్ గా వేశారు. మళ్ళీ కాస్త ఇంప్రూవ్ చేస్తూ పోకిరి చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజు కి గ్రాండ్ గా స్పెషల్ షోస్ ప్లాన్ చేసి వేశారు. అది గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. పోకిరి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమా వెయ్యగా, అది బాక్స్ ఆఫీస్ వద్ద మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
ఆ తర్వాత జల్సా రికార్డుని పవన్ కల్యాణే ఖుషి రీ రిలీజ్ తో బ్రేక్ చేసాడు. ఖుషి చిత్రమే ఇప్పటి వరకు లాంగ్ రన్ లో రికార్డు గా నిల్చింది. ఇప్పుడు ఈ రికార్డు టార్గెట్ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన మురారి చిత్రం. ఈ సినిమాని ఆగస్టు 9 వ తారీఖున మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గానే మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రం హైదరాబాద్ లో కోటి రూపాయలకు పైగా గ్రాస్ మార్కుని కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాటేసింది.
బుక్ మై షో యాప్ లెక్కల ప్రకారం ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 65 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం కల్కి చిత్రానికి రెండు శని, ఆదివారం కి కలిపి కేవలం 45 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, మురారి చిత్రానికి 65 వేలకు పైగా టిక్కెట్లు సేల్ అయ్యాయి. ఇది నిజంగా అభిమానులు కూడా ఊహించలేకపోయారు, విడుదల తర్వాత కూడా ఈ చిత్రం అనితర సాధ్యం అనుకుంటున్న ఖుషి 7 కోట్ల రూపాయిల గ్రాస్ ని అధిగమిస్తుందా లేదా అనేది చూడాలి.