Mahesh Babu :సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ,చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటిస్తూ నిత్య యవ్వనంగా ఇప్పటికీ ఎందరో కలల రాకుమారుడు గా ఉన్న మహేష్ బాబు ఖాతాలో సూపర్ డూపర్ హిట్స్ ఎన్నో ఉన్నాయి. మామూలుగా సినిమా అంటేనే తారలు మేకప్ లేకుండా కెమెరా ముందుకు రారు.

అందునా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మేకప్ లేకుండా సినిమా చేశాడు అంటే.. నమ్మడం కష్టమే.సినిమా మొత్తం మేకప్ లేకుండా మహేష్ బాబు నటించిన ఒకే ఒక సినిమా…తేజ డైరెక్షన్లో తెరకెక్కిన నిజం మూవీ. గోపీచంద్ విలన్ గా నటించిన ఈ మూవీ మహేష్ బాబు యాక్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది.

డాక్టర్ అవ్వాలి అన్న ఆంబిషన్ తో చదువుకునే ఒక మధ్యతరగతి కుర్రాడు తన తండ్రికి జరిగిన అన్యాయం చూసి ఎటువంటి బాధలు అనుభవించాడు అనేది ఈ చిత్రం కంటికి కట్టినట్టు చూపిస్తుంది.2003లో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేక పోయింది. నిజం కోసం పోరాడే యువకుడి పాత్ర లో నటించిన మహేష్ బాబు మొత్తం మేకప్ లేకుండా యాక్ట్ చేశాడు.

నిజం మూవీ హిట్ కాకపోయినా.. మహేష్ కెరియర్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ మూవీలో పాటలు మంచి పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్నాయి.ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ రెడీ అవుతుంది. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఇది కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు.
ఈ మూవీలో మహేష్ బాబు తో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా జత కడుతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై హై స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే సంవత్సరం జనవరి 13న విడుదల చేస్తారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత మహేష్ మరియు రాజమౌళి కంపెనీ మరొక పాన్ ఇండియన్ చిత్రం స్టార్ట్ చేయడం జరుగుతుంది.