Mahesh Babu : టాలీవుడ్ లో అత్యధిక బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. ఒక్కో సినిమాకి 70 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే మహేష్ బాబు, ఇలా యాడ్స్ ద్వారా సంవత్సరానికి అదనంగా మరో 200 కోట్ల రూపాయిలను సంపాదిస్తున్నాడు.
అయితే మహేష్ బాబు ఏ యాడ్ ఒప్పుకోవాలన్న ముందుగా ఆ బ్రాండ్ తాలూకు హిస్టరీ మొత్తాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత క్లీన్ & గ్రీన్ గా అనిపించిన తర్వాతనే యాడ్ చెయ్యడానికి ఒప్పుకుంటాడు. అలా అనుకొనే శ్రీ సాయి సూర్య రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఈ కంపెనీ కి సంబంధించిన యాడ్ లో కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ,కొడుకు గౌతమ్, కూతురు సితార కూడా కలిసి నటించారు.
అయితే ఈ కంపెనీ మీద ఇప్పుడు విష్ణు వర్ధన్ అనే వినియోగదారుడు చీటింగ్ కేసు వేసాడు. అసలు విషయానికి వస్తే వ్యవసాయత్ర భూమి కొరకు విష్ణు వర్ధన్ అనే వినియోగదారుడు తన స్నేహితులతో కలిసి మూడు కోట్ల 20 లక్షల రూపాయిలు పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడి పెట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయిస్తామని మాట ఇచ్చిన ఈ సంస్థ , ఎన్నేళ్లు అయినా దాని ఊసే ఎత్తకపోవడం తో విష్ణు వర్ధన్ కి మోసం చేస్తున్నారేమో అని అనుమానం వచ్చి విచారణ మొదలు పెట్టాడు.
ఆ విచారణ లో తేలింది ఏమిటంటే విష్ణు వర్ధన్ మరియు అతని స్నేహితులు పెట్టుబడి పెట్టిన భూమిని ఎస్వీఆర్ వెంకటేష్ కంపెనీ మీద రిజిస్ట్రేషన్ చేయించాడట. దీంతో ఆగ్రహించిన విష్ణు వర్ధన్ వెంటనే శ్రీ సాయి సూర్య సంస్థ అధినేత కంచర్ల సతీష్ చంద్ర గుప్త మీద చీటింగ్ కేసు వేసాడు. ఇప్పుడు ఈ సంస్థకి మాత్రమే కాదు, ఈ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన మహేష్ బాబు కూడా సోషల్ మీడియా లో చాలా తీవ్ర స్థాయిలో నెగటివిటీ ని ఎదురుకుంటున్నాడు.