Mahesh Babu : ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే చర్చ. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అపజయం అంటూ ఎరుగని దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గురించే. ఈ చిత్రానికి సంబంధించిన రోజుకో అప్ డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇటు సినీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో సినిమా కోసం క్యూరియాసిటీ ఎక్కువైంది. ఎప్పుడెప్పడు షూటింగ్ మొదలై.. థియేటర్లోని వస్తుందా అంటూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో సినిమా అది వేరే లెవల్.. సినిమా ఎలా ఉన్నా ఆయన ప్రమోషన్స్ తోనే జనాలను థియేటర్లకు రప్పిస్తుంటారు.

ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరొక క్రేజీ అప్డేట్ నెట్టింట్లో లీకై సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. స్టార్ దర్శకుడు సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఫ్యాన్స్ ఆ మూవీలో మన హీరో రోల్ ఏంటి ..? ఎలా కనిపించబోతున్నాడు ..? అన్న ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబుని ఏ విధంగా రాజమౌళి చూపించబోతున్నాడంటూ జనాలు ఈగర్ గా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అందుకు సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ అవుతోంది.

సూపర్ స్టార్ రోల్ చాలా ఇంటెన్సీగా ఉండబోతుందట. సాలిడ్ వేరియేషన్స్ తో మస్తు షేడ్స్ ఉన్న రోల్లో మహేష్ బాబు కనిపించబోతున్నాడట. అంతేకాదు తన కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని మహేష్ బాబు లుక్ ను ఈ సినిమాలో చూడబోతున్నామని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఓ జబ్బు బారిన పడిన మనిషిగా కనిపించబోతున్నాడట మహేష్. గుంటూరు కారంలో ఒక కన్ను కనిపించని వ్యక్తిగా కనిపించాడు మహేష్ బాబు . ఆ సినిమా నెగిటివ్ టాక్ అందుకుంది . దీంతో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరోసారి అలాంటి రిస్క్ అవసరమా ..? అంటూ ఆందోళన చెందుతున్నారు.