Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫ్యాన్స్‌లో పూనకాలే మొదలవుతాయి. ఆయన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీస్ అంటే ఆడియన్స్ కి కొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. అవేంటంటే.. మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు సినిమాలు.

ఈ సినిమాలు మహేష్ బాబుని బడా మాస్ హీరోని చేయడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో టాలీవుడ్ లో కొత్త రికార్డులను సృష్టించింది. ఇక మహేష్ బాబు రీసెంట్గా నటించిన గుంటూరు కారం మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు ఎంతో మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కాగా, ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, తనకు నచ్చిన ఫేవరెట్ హీరోయిన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
కాగా, యాంకర్ మీకు నమ్రత, త్రిష, సమంత, కియార, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీలీల వంటి స్టార్ బ్యూటీస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కదా, మీకు అందులో ఎవరితో మళ్లీ మళ్లీ నటించాలని పిస్తుంది. అని అడగ్గా, ఒక్కసారిగా షాకైన మహేష్ బాబు, ఆలోచించుకోకుండా త్రిష అంటూ చెప్పుకొచ్చాడు. ఆమెతో స్క్రీన్ స్పేస్ బాగుంటుంది, అంతేకాకుండా తనతో సీన్స్ చాలా ఈజీగా నటించవచ్చంటూ తెలిపాడు. అయితే ఆమెతో ఉన్న స్నేహం కారణంగానే అతను త్రిష పేరు చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక తర్వాత స్థానంలో సమంత ఉంటుందని చెప్పుకొచ్చాడు.

మహేష్ బాబు హీరోగా త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ SSMB 29 గ్రాండ్ గా లాంచ్ కానున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఈ క్రేజీ ప్రాజక్ట్ ఎప్పుడు మొదలు అవుతుందా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు మహేష్ బాబు ఈ మూవీ కోసం పూర్తిగా క్రాఫ్, గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలో ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.