Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాల నటుడి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇటీవలె ఆయన ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇక ప్రస్తుతం మహేశ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోయాడు. జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాలతో పాటు మహేశ్ బాబు పలు యాడ్స్‌లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
ప్రస్తుతం ఇండియన్ టాప్ మోస్ట్ కార్పొరేట్ బ్రాండ్స్ అన్నీ మహేష్ బాబు చేతుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తమ ప్రొడక్ట్స్ కోసం వాటి యజమానులు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు సైతం ఇటీవల కాలంలో చేసే యాడ్ల సంఖ్యను కూడా పెంచేశాడు. ఇటీవల ఫ్లిప్ కార్ట్ యాడ్, ఫోన్ పే యాడ్ లో కనిపించిన మహేష్.. తాజాగా పాన్ బహార్ బ్రాండ్‌ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఈ పాన్ బహార్ బ్రాండ్‌ని మహేశ్ ప్రమోట్ చేయడంపై నెట్టింట్లో తనకు నెగిటివిటీ పెరిగింది.
ఒక స్టార్ హీరో అయి ఉండి.. ఇలాంటి గుట్కా ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాటికి ప్రమోట్ చేయటం ఏంటని..? జనాలు ప్రశ్నిస్తున్నారు. అసలు అలాంటి ఈవెంట్‌కు ఆయన హాజరవడంపై కూడా తప్పుపడుతూ.. వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. ఆ వీడియో ఎవరు తయారు చేశారు, ఎవరూ పోస్ట్ చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో పై తీవ్ర చర్చ నడుస్తోంది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే.. తర్వాత ఆ వీడియో డిలీట్ అయింది. మహేశ్ బాబు టీమ్ దీనిని డిలీట్ చేయించిందో, లేక వేరే ఎవరైనా ఈ పని చేశారో అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఏదేమైనా ఈ వీడియో మాయమవడంపై పలు అనుమానులు కూడా ఉన్నాయి.. కానీ అభిమానులు మాత్రం వీడియో డిలీట్ కావడంతో కాస్త సంతోషిస్తు్న్నారు.