Mahesh Babu : ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోగా సత్తా చాటుతూ వస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ఒక్కో మూవీకి రూ. 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్. ఇదిలా ఉంటే, తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ ల్యాండ్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు సమాచారం. హైదరాబాద్ శివార్లలోని 2.5 ఎకరాల భూమిని సూపర్ స్టార్ మహేష్ బాబు కొనుగోలు చేశారుట.

శంకర్ పల్లి సమీపంలోని గోపులారం పరిధిలో ఈ భూమిని కొన్నారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం బుధవారం (మార్చి 6) శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ వెళ్లారు. అలాగే అక్కడ రిజిస్ట్రేషన్ పనులు ముగించుకున్నారు. మహేష్ బాబు కొనుగోలు చేసిన శంకర్ పల్లి పరిధిలోని రెండున్నర ఎకరాల భూమి నమ్రతా శిరోద్కర్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. దీని విలువ కూడా కోట్లలోనే ఉంటుందని టాక్.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి. ఇక శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన నమ్రతా శిరోద్కర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడున్న వారు ఇంట్రెస్ట్ చూపించారు. నమ్రతా కూడా ఎంతో ఓపికగా వారందరికీ సెల్ఫీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారితోపాటు ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది సైతం నమ్రతాతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు మహేష్ బాబు భార్య వచ్చిన విషయం తెలిసి కొంతమంది స్థానికులు నమ్రతాను చూసేందుకు అక్కడికి వచ్చారు.