Mahaveerudu Review : కామెడీ అదిరింది కానీ..!

- Advertisement -

ఒక కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి , ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో నటించి, ఇప్పుడు కోలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరో గా యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు శివ కార్తికేయన్. తమిళనాడు లో అజిత్ , విజయ్ మరియు రజినీకాంత్ తర్వాత మంచి మార్కెట్ ఉన్న హీరో ఈయన. తెలుగు లో కూడా శివ కార్తికేయన్ పలు సినిమాల ద్వారా సుపరిచితమే. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రాలు ‘డాక్టర్’ మరియు ‘డాన్’ వంటివి తెలుగు లో కూడా దబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. ఆయన కామెడీ టైమింగ్ కూడా తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చింది. అందుకే ఆయన ప్రతీ సినిమా ఈమధ్య తెలుగులో విడుదల అవుతున్నాయి. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘మహావీరుడు’ అనే చిత్రం నిన్న తెలుగు, తమిళ బాషలలో గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాము.

Mahaveerudu Review
Mahaveerudu Review

కథ :

సత్య( శివ కార్తికేయన్) అనే ఒక మామూలు కుర్రాడు , తన తల్లి (సరిత) మరియు చెల్లి తో కలిసి ఒక బస్తీలో బ్రతుకుతుంటాడు. జీవనాధారం కోసం ఆయన ఒక ప్రముఖ దిన పత్రిక లో కార్టూనిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు. స్వతహాగా ఆయన చాలా భయస్తుడు, ప్రతీ విషయం లోను సర్దుకుపోయే మనస్తత్వం గలవాడు. కానీ సత్య తల్లి మాత్రం అలా కాదు, ప్రతీ విషయానికి ఆమెకి కోపం వచ్చేస్తుంది, ముఖ్యంగా ఎక్కడైనా అన్యాయం జరిగితే అసలు ఆమెను ఆపలేము.

- Advertisement -

అయితే ఒక రోజు అధికార పార్టీ బస్తీ లో ఉన్న ప్రజలందరికీ అపార్ట్మెంట్ కట్టించి, అందులోకి జనాలందరికి ఇళ్ల పట్టాలు ఇస్తాడు. రోడ్ల భవనాల శాఖామంత్రి జయ సూర్య , ఆ భవనాన్ని చాలా నాసిరకంగా కడుతాడు. తలుపులు కిటికీలు ఇలా అన్ని ఊడిపోతుంటాయి. పైకప్పులు కూడా ఊడి ఇళ్లల్లో ఉంటున్న వారిపై పడి తీవ్రమైన గాయాలు అవుతాయి.సత్య తల్లి దీనిపై పోరాడాలని అనుకుంటుంది.

కానీ సత్య సర్దిచెప్తూ ఉంటాడు, తన చెల్లి పట్ల అధికార పార్టీకి చెందిన రౌడీ మూకలు అసభ్యంగా ప్రవర్తించిన ఎదురు తిరిగి పోరాటం చెయ్యలేని పిరికివాడు సత్య. ఒకరోజు ఇవన్నీ తట్టుకోలేక, ఏమి చెయ్యలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. అప్పుడు ఆకాశం నుండి ఆయనకీ కొన్ని మాటలు వినిపిస్తాయి, ఆ మాటలు పిరికివాడైన సత్య ని అధికార పార్టీ మనుషులతో పోరాడే శక్తిని ఎలా ఇచ్చింది. ఆ ప్రజాభవనం నుండి జనాలను ఆయన ఎలా కాపాడాడు అనేది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

ఒక పిరికివాడు ధైర్యవంతుడిగా మారి అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను ఎలా ఎదురుకున్నాడు అనే పాయింట్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ మడోన్ అశ్విన్. శివకే కార్తికేయన్ సింబీమా అంటే కచ్చితంగ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ని ఆశిస్తారు. అందుకే సీరియస్ సబ్జెక్టు అయ్యినప్పటికీ కూడా డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తో నింపేసాడు. యోగి బాబు హాస్యం చాలా బ్బాగా క్లిక్ అవ్వడం యథా ఫస్ట్ హ్హాఫ్ సూపర్ గా ఉంది అని అనిపిస్తుంది. అమాయకత్వం , పిరికితనం నుండి హీరో నుండి పుట్టే కామెడీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. కొన్ని కొన్ని సార్లు హీరో పిరికితనం చూసి ఆడియన్స్ అసహ్యించుకునేలా చేస్తుంది.

ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగున్నప్పటికీ , సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్లో గా ఉండడం ఈ సినిమాకి మైనస్ అయ్యింది. ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో పండలేదు, అదే ఈ చిత్రానికి పెద్ద మైనస్. కథలో ట్విస్టులు పెట్టి ఉన్నా ప్రేక్షకుడు ఆసక్తిగా చూసేవాడు, కానీ చాలా సాదాసీదాగా ఈ స్టోరీ నడుస్తాది. అందుకే ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ కాస్త బోర్ కొడుతోంది. ఇక శివ కార్తికేయన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది,ఎలాంటి ఎమోషన్ ని అయినా అద్భుతంగా ఈజ్ తో పండించడం ఆయన స్పెషలిటీ, ఈ చిత్రం లో కూడా అదే చేసాడు. ఇక హీరోయిన్ అదితి శంకర్ కూడా తన పరిధిమేర చాలా చక్కగా నటించింది. ఇక భర్త శంకర్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు.

చివరి మాట :

ఎంటర్టైన్మెంట్ ని కోరుకునేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది, తక్కువ అంచనాలు పెట్టుకొని వెళ్తే సినిమా ని మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు.

నటీనటులు: శివ కార్తీకేయన్, అదితి శంకర్, మిస్కిన్, సునీల్ తదితరులు
దర్శకత్వం: మడొన్నే అశ్విన్
నిర్మాత: అరుణ్ విశ్వ
సినిమాటోగ్రఫి: విదు అయ్యన్న
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
మ్యూజిక్: భరత్ శంకర్
బ్యానర్: శక్తి టాకీస్

రేటింగ్ : 2.75 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here