Madhavi latha : కొత్తగా రంగుల ప్రపంచ విహరించాలని కోటి ఆశలతో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టే కొత్త హీరోయిన్లను పడకసుఖాలకే పరిమితం చేస్తున్నారంటూ టాలీవుడ్లో జరుగుతున్న చీకటిబాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గాయత్రి గుప్త.. శ్రీరెడ్డి.. మాధవి లత. ఇలా ఒక్కొక్కరుగా టాలీవుడ్లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ ( అవకాశాల పేరుతో వాడుకోవడం) గురించి నోరు విప్పారు.
నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మాధవి లత ఆ తరువాత మూడు నాలుగు సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ దక్కకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అయితే తెలుగు హీరోయిన్లను కావాలనే తొక్కేస్తున్నారని.. దర్శక, నిర్మాతలు చెప్పినట్లు వినాలని అప్పుడే ఆఫర్స్ వస్తాయంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె ఓపెన్ అయ్యింది. తాను హీరోయిన్గా ప్రయత్నిస్తున్న టైం ఓ కోఆర్డినేటర్ ఫోన్ వచ్చింది. హీరోయిన్గా నటించేందుకు మంచి ఆఫర్ ఉంది. కాకపోతే చాలా కమిట్మెంట్తో ఉండాలని ముందుగా తనతో ఒక రాత్రి గడిపితే నీ ఫిగర్ గురించి నిర్మాతలకు చెబుతా అంటూ పిచ్చిగా మాట్లాడాడు. ఆ తరువాత నాకు విషయం అర్థమై అతని ఫోన్ కట్ చేశా అన్నారు. ఇక ఆ తరువాత ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని నిర్మాతలు, కోఆర్డినేటర్లు డైరెక్ట్‌గా ఫోన్ చేసి నైట్ ఫ్రీనా అని అడిగేవారంటూ వాపోయింది.
ఓ నిర్మాత అయితే సినిమాల్లో రాణించాలంటే ఇలాంటివి కామనే. నాతో కమిట్మెంట్కి ఒప్పుకుంటే మంచి ఆఫర్ ఇస్తా వస్తావా అని అడగడంతో చెప్పుతో కొడతా అని ఫోన్ పెట్టేశా. ఆ తరువాత ఇలాంటి ఫోన్ కాల్స్ చాలానే ఉన్నాయంటూ లైంగిక వేధింపుల్ని బయటపెట్టింది. అయితే ఇలా జరుగుందని బయటకు చెప్పితే పాపులారిటీ కోసం ఇలా చేస్తుందని అంటున్నారని.. ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపుల బారిన పడిన వాళ్లు చాలా మంది ఉన్నారని అయితే గతి లేక శరీరాల్ని లంచంగా అర్పించుకుంటున్నారన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటున్నారు మాధవి. అయితే తనను వేధించిన నిర్మాతల ఎవరో బయటపెడితే ఇండస్ట్రీకి, వాళ్లను నమ్ముకున్న వాళ్లకి నష్టం జరిగే అవకాశం ఉన్నందున వాళ్ల పేర్లు బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు మాధవి.