Madhavi Latha : ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది యంగ్ హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నారు.కొంతమంది అయితే కెరీర్ కోసం క్యాస్టింగ్ కౌచ్ కి తలొగ్గి దర్శక నిర్మాతలు అడిగింది చేసేవారు. మరికొంతమంది అయితే వాటికి ఒప్పుకోక ఇండస్ట్రీ నుండి వైదొలగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు మాధవిలతా.

ఈమె రవిబాబు దర్శకత్వం లో తెరకెక్కిన ‘నచ్చావులే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని తో కలిసి ‘స్నేహితుడా’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు కానీ, నటిగా ఈమెకి మంచి మార్కులు పడేలా చేసింది. సినిమాల్లో కంటే ఈమె ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే పాపులారిటీ ని సంపాదించుకుంది.

మనసులో ఉన్న మాటని మంచి అయినా చెడు అయినా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టే విధంగా మాట్లాడడం మాదవిలతా కి అలవాటు. అయితే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో తనకి ఎదురైనా సంఘటనల గురించి చెప్పుకుంటూ ‘నా తండ్రి వయస్సు ఉన్న ఒక నటుడు నన్ను రూమ్ కి ఒంటరిగా రమ్మని పిలిచాడు. అలాగే నేను ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు ఒక పెద్దాయన నన్ను తాకుతూ చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.

యూత్ కన్నా పెద్ద వయస్సు ఉన్న వారే ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు. యువకులు అయినా ముందు వెనుకా ఆలోచిస్తారు, కానీ పెద్దవాళ్ళు మాత్రం అన్నీ హద్దులను దాటేస్తున్నారు.. వాళ్ళు అలాంటి పనులు చేసి కూడా తెలివిగా, చాలా తేలికగా తప్పించేసుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చింది మాధవి లతా. ఈమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.