Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ చిత్రం కోసం పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులు, ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారో మన అందరికీ తెలిసిందే. ఆగష్టు 15 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అవుతుంది అనుకున్న ఈ చిత్రం, కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6 వ తేదికి వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం మొదటి భాగం కంటే అద్భుతంగా ఉంటుందని, ప్రస్తుతం ఎంతో ప్రెస్టీజియస్ గా మారిన వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చాలా తేలికగా వెళ్ళిపోతుందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
అయితే ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రం డిసెంబర్ ఆరవ తేదీన కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదట. గత 10 రోజుల నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం ఆగిపోయాయి. ఈ చిత్రం లో పనిచేసే కొంతమంది నటీనటులు సుకుమార్ అంచనాలకు తగ్గట్టుగా నటించలేకపోవడంతో, అతనిలో ఏర్పడిన అసహనం కారణంగానే ఇన్ని రోజులు షూటింగ్ ని నిలిపివేసాడట. అంతే కాకుండా ఇప్పటి వరకు తీసిన సన్నివేశాల్లో అధిక శాతం రీ షూటింగ్ చెయ్యాల్సిన అవసరం ఉందట. ఇదంతా సుకుమార్ కి ఒకింత కోపానికి గురి చేసినట్టు తెలుస్తుంది. మరోపక్క అల్లు అర్జున్ కూడా సుకుమార్ తీరుపట్ల గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది.
సుమారుగా మూడేళ్ళుగా ఆయన పుష్ప సిరీస్ కోసమే తన విలువైన మూడేళ్ళ సమయాన్ని వెచ్చించాడు. కేవలం ఈ సినిమా కోసమే ఆయన అట్లీ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ ని కూడా వదులుకోవాల్సి వచ్చిందట. అంతే కాకుండా అల్లు అర్జున్ తో కమిట్ అయిన మరో ఇద్దరు ముగ్గురు పాన్ ఇండియన్ దర్శకులు కూడా పుష్ప 2 ఆలస్యం వల్ల అసహనం కి గురి అవుతున్నారు. వారిలో సందీప్ వంగ కూడా ఉన్నారు. ఆగిపోయిన షూటింగ్ మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి అత్యంత సందిగ్ద పరిస్థితిలో ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు ఇక లేనట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.