చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్. ‘నువ్వే కావాలి’, ‘నువ్వే నువ్వే’, ‘నువ్వులేక నేనులేను’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏవీ కూడా అంతగా ఆడలేదు. ఇదిలా ఉంటే.. అప్పట్లో దివంగత నటి ఆర్తి అగర్వాల్‌తో తరుణ్ ప్రేమాయణం నడిపారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

కానీ వాస్తవాలు మాత్రం ఎవరికీ కూడా తెలియదు. కారణం ఏదైనా ఆర్తి అగర్వాల్ ను తమ ఇంటికి కోడలుగా చేసుకునేందుకు తరుణ్ తల్లి రోజా రమణి ఒప్పుకోకపోవడం.. ఆ తర్వాత వీరి ప్రేమకు పోలీస్ స్టాప్ పడిపోవటం.. ఆర్తి అమెరికాకు చెందిన ఎన్నారై ని పెళ్లి చేసుకుని రెండేళ్లకే విడాకులు ఇచ్చేయటం.. అనంతరం ఆమె అనారోగ్యంతో మృతి చెందటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే వీరిద్దరి ప్రేమకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక చిన్న లింక్ ఉంది. తరుణ్ – ఆర్తి అగర్వాల్ తొలిసారిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో నటించారు. ఆ సినిమాతోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడింది. ఆ సినిమా దర్శకుడు కాశీ విశ్వనాథ్ సురేష్ బాబుకు కథ చెప్పగానే మహేష్ బాబుతో ఈ సినిమా తీయాలని సురేష్ బాబు పట్టుబట్టారట.

అయితే అప్పటికే మహేష్ బాబు ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో తరుణ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కించారు కాశీ విశ్వనాథ్. ఒకవేళ ఆ సినిమాలో సురేష్ బాబు కోరిక మేరకు మహేష్ హీరోగా నటించి ఉంటే కచ్చితంగా ఆర్తికి తొలి సినిమాతోనే మహేష్ బాబు లాంటి పెద్ద హీరోతో నటించే అవకాశం వచ్చినట్లు అయ్యేది. ఆ తర్వాత ఆమెకు అస్సలు తిరుగే ఉండేదే కాదు. అయితే అనుహ్యంగా ఆమె తరుణ్ తో నటించడం.. ఆ తరుణ్‌తోనే ప్రేమలో పడటం.. చివరకు చిన్న వయసులోనే ఆమె కెరీర్ పాతాళంలో పడిపోవడంతో పాటు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అని జరిగిపోయాయి.