Uday Kiran : ఉదయ్ కిరణ్ ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన ఈయన అనతి కాలంలోనే కాలంచేశారు. ఈ హీరోకి ఎలాంటి ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా అమ్మాయిలా కలల రాకుమారుడుగా మారిపోయాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల కూతుర్లు కూడా తమ బుక్స్ లో ఉదయ్ కిరణ్ ఫొటోలను పెట్టుకుని సరదా పడ్డారంటే సిచ్యుయేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఎంత త్వరగా ఇండస్ట్రీకి వచ్చాడో.. అంతే త్వరగా కనుమరుగైపోయాడు. వ్యక్తిగతంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ సూసైడ్ ఇండస్ట్రీలో ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఇది విన్న వారంతా అయ్యో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ లాగానే ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఓ హీరో ఇప్పుడు సినిమాలే లేక అల్లాడిపోతున్నాడట.

ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అని .. ఒకవేళ ఉదయ్ కిరణ్ లాంటి మైండ్ సెట్ తో ఆ హీరో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఇండస్ట్రీ మరో చెడ్డ వార్త వినడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి దావుపరించిందని.. కొందరు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.