విజయ్ దేవరకొండ టైటిల్ రోల్‌లో నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్ (Puri Jagannadh). బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ (liger) డైరెక్ట్ చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. అయితే తాజాగా లైగర్‌తో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ముందు ఆందోళన చేపట్టారు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైగర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే.. తమకు భారీగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లైగర్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమను ఆదుకుంటామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు. అందువల్లే తాము రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నట్టు చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగిస్తామని అంటున్నారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. గతంలో డిస్ట్రిబ్యూటర్ల వ్యవహారంపై పూరీ ఓ ఆడియో టేప్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆచార్య సినిమా సినిమా ప్లాప్ అయితే చిరంజీవి, రామ్ చరణ్ వెంటనే రూ.13 కోట్లు ఇచ్చారని అన్నారు. అలాంటి వాళ్లని చూసి పూరి జగన్నాధ్ సిగ్గు తెచ్చుకోవాలని వాళ్లు అన్నారు. ఇప్పటికైనా డబ్బు ఇవ్వకపోతే పూరీ సినిమాలు ఆడకుండా చేస్తామంటూ హెచ్చరించారు. అనవసరంగా లైగర్’ (Liger) చిత్రాన్ని ప్రదర్శించి తాము నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు శుక్రవారం ధర్నా చేపట్టారు. నష్టాన్ని భర్తీ చేస్తామని చిత్ర నిర్మాత పూరీ జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయ్యిందని, కానీ, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని వాపోయారు. ఈ మేరకు ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టారు. పూరీ జగన్నాథ్ తమకు న్యాయం చేయాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.