Leo Movie : డివైడ్ తో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడం అందరికీ సాధ్యం కాదు. ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ కాలం లో కాస్త టాక్ బాగాలేకపోయినా సినిమాలు డిజాస్టర్స్ అయిపోతున్నాయి. రీసెంట్ గా ఎన్నో ఉదాహరణలు మనం చూసాము. అలాంటి ఇంత క్లిష్టమైన పరిస్థితి లో ఒక సినిమాకి డివైడ్ టాక్ వచ్చిందంటే నిర్మాతకి గుండెపోటు వచ్చేస్తుంది.

కానీ సౌత్ లో కొంతమంది స్టార్స్ మాత్రం తమ స్టార్ స్టేటస్ తో ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ తోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి హీరోలలో ఒకడే తలపతి విజయ్. ఒకప్పుడు ఈయన పేరు మన తెలుగు ఆడియన్స్ ఎవ్వరికీ పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు మన తెలుగులో కొంతమంది హీరోస్ తో పోటీ పడే రేంజ్ కి వెళ్ళింది. రీసెంట్ గా విడుదలైన ‘లియో’ చిత్రమే అందుకు ఉదాహరణ. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

కానీ మొదటి నాలుగు రోజుల్లోనే తెలుగు వెర్షన్ లో 17 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టి బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది. ఇక తమిళనాడు సంగతి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల రూపాయిలను దాటేసి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయిలను కూడా క్రాస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Top-5 overseas opening weekend of South Indian Films
— ForumKeralam (@Forumkeralam2) October 23, 2023
1.#Baahubali2: US$ 22.5M
2.#LEO: US$ 18M
3.#RRR: US$ 16M
4.#Jailer: US$ 15.35M
5.#KGFChapter2: US$ 14.6M#LEO stands tall with $18M overseas gross in 4 Days 🙏 pic.twitter.com/I7b5H03E0O
కేవలం నాలుగు రోజుల్లోనే 18 మిలియన్ డాలర్ల వసూళ్లను కొల్లగొట్టింది ఈ సినిమా. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 150 కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట. #RRR చిత్రానికి మొదటి వీకెండ్ లో ఓవర్సీస్ లో కేవలం 16 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. కానీ ‘లియో‘ చిత్రం #RRR ని రెండు మిలియన్ డాలర్ల మార్జిన్ తో కొల్లగొట్టి సెన్సేషన్ సృష్టించింది. డివైడ్ టాక్ తోనే ఇంత రచ్చ చేస్తే, ‘జైలర్’ రేంజ్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఇంకా ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.