ఈ మధ్య కాలంలో దళపతి విజయ్ నటించిన ఏ సినిమాకు లేనటువంటి బజ్ లియో సినిమాకు వస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరో విజయ్ కావడం.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కావడం సినిమాకు బాగా హైప్ తీసుకొచ్చింది. భారీ బడ్జె్ట్ తో ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న విడుదలకు పాన్ ఇండియా లెవల్లో రెడీగా ఉంది. ఇందులో దాదాపు కొన్నేళ్ల తర్వాత విజయ్ సరసన త్రిష నటిస్తోంది. అలాగే హీరో అర్జున్ సర్జ విలన్ గా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్, నటుడు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న లియో సినిమా మైండ్ బ్లోయింగ్ అంటూ తెలియజేశారు. సినిమాలోని తన సన్నివేశాలు కొన్ని చూశాను సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. విజయ్ వంటి గొప్ప యాక్టర్ తో నటించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా షూటింగ్ సమయంలో విజయ్‌ని ఎక్కువగా గమనిస్తుండే వాడినని.. షూటింగ్ 9 గంటలు అంటే ఆయన ఏడు గంటలకే లొకేషన్ కు వచ్చేవారని తెలిపాడు. అలా వచ్చి రాగానే స్క్రిప్ట్ పేపర్ తీసుకొని డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంటారని తెలిపారు. ఆయనకి సినిమా పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలిపారు గౌతమ్. కచ్చితంగా లియో సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది అంటూ ఫస్ట్ రివ్యూ ను తెలియజేశారు.