Lavanya Tripathi : మెగా ఫ్యాన్స్ అందరూ అలా పిలుస్తున్నారు.. ఆ కుటుంబంలోకి వచ్చినందుకేగా ఇదంతా అనిపిస్తుంది: లావణ్య త్రిపాఠి

- Advertisement -

Lavanya Tripathi .. మెగా వారసుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొణిదెల వారి ఇంటికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తరువాత కూడా లావణ్య.. నటనని కొనసాగిస్తూనే వస్తున్నారు. తాజాగా లావణ్య నటించిన వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.

Lavanya Tripathi
Lavanya Tripathi

ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఉన్న లావణ్య.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మెగా ఫ్యాన్స్ ‘వదిన’ అని పిలవడంపై తన రియాక్షన్ ఏంటో తెలియజేసారు. మెగా ఫ్యామిలీలో తనని వదిన అని పిలిచేది.. కేవలం వరుణ్ తేజ్ సిస్టర్ నిహారిక మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇక మెగా ఫ్యాన్స్ అంతా కూడా లావణ్యని వదిన అనే పిలుస్తారు అని చెప్పగా, ఆమె రియాక్ట్ అవుతూ.. ‘అవునా, సో స్వీట్” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మెగా ఫ్యామిలీలో తన జర్నీ గురించి కూడా కామెంట్స్ చేశారు.

Lavanya Tripathi Varun tej

“ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరు నాతో ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తారు. కేవలం ఆ కుటుంబం మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీకి చెందిన ఫ్యాన్స్ ప్రేమని కూడా నేను పొందుతున్నాను. మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మిస్ పర్ఫెక్ట్ సిరీస్ విషయానికి వస్తే.. లావణ్య ఓవర్ క్లీన్‌నెస్ (OCD) కలిగిన పాత్రని పోషించారు. అన్ని క్లీన్‌ అండ్ కరెక్ట్ గా ఉండాలి అనే ఫీల్ అయ్యే ఈ పాత్రకి.. క్లీన్‌నెస్ కి అర్ధం తెలియని అభిజీత్ లాంటి పాత్ర జత అయితే.. ఆ కథ ఏంటనేది లవ్ అండ్ కామెడీగా తెరకెక్కించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here