Lavanya Tripathi: అందాల రాక్షసి అనగానే మనకు గుర్తొచ్చేది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. నాన్నా.. నాకు పెళ్లి చేసేయండి అంటూ కొంటె డైలాగులతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది. ఈ సినిమాలో మిథునగా అలరించి.. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. ఓవైపు నాగార్జున వంటి అగ్రహీరోలు.. మరోవైపు వరుణ్ తేజ్, నిఖిల్ వంటి యంగ్ హీరోలతో జతకట్టింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎంట్రీ ఇచ్చింది.
లావణ్య సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఈ భామకు సోషల్ మీడియాలో యమా ఫాలోయింగ్ ఉంది. తన సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం లావణ్య తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను వారితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా లావణ్య వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. విదేశీ వీధుల్లో జాలీగా.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోంది.
తాజాగా లావణ్య షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో లావణ్య క్యాజువల్ ప్యాంట్ అండ్ టీ షర్ట్ వేసుకుని ఆ పైన జాకెట్ తో క్లాసీ టచ్ ఇచ్చింది. ఇక హెయిర్ ను లూస్ గా వదిలేసి తన క్యూట్ డింపుల్స్ తో మాయ చేసింది. ఫారిన్ వీధుల్లో హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా ఐస్ క్రీమ్ తింటూ పోజులిచ్చింది. ఈ ఫొటోలో ఐస్ క్రీమ్ పై అభిమానులు మనసు పారేసుకుంటున్నారు. ఆ ఫొటో చూడగానే తమకూ ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. లావణ్య డింపుల్స్ చాలా క్యూట్ గా ఉన్నాయంటూ పొగిడేస్తున్నారు. సొట్టబుగ్గల సుందరి అంటూ తమ ప్రేమను కురిపిస్తున్నారు.
ఇక లావణ్య సినిమాల సంగతికి వస్తే ఈ భామ గతేడాది హ్యాపీ న్యూ ఇయర్ అనే డార్క్ కామెడీ సినిమాలో నటించింది. ఆ తర్వాత పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటించి విమర్శకులను మెప్పించింది. ఈ సిరీస్ లో లావణ్య కిరణ్ ప్రభ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది సందడి చేసింది.