Tamannaah Bhatia : సినిమా అనేది రంగుల ప్రపంచం.. క్షణ క్షణానికి రంగులు మారుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొందరు రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ అందుకోవచ్చు. మరి కొందరు ఒక్క సినిమాతోనే ఫేడ్ అవుట్ కూడా కావొచ్చు. ఇలాంటి వాటిని అస్సలు గెస్ చేయలేం. అలాంటి సిచువేషన్స్.. ఎన్నెన్నో వచ్చాయి… వస్తూనే ఉన్నాయి.. మనం చూస్తూనే ఉన్నాం.. ఉంటాం కూడా. అయితే ప్రస్తుతం తమన్నా పొజిషన్ కూడా ఎటు అర్థం కాని స్థితిలో పడిపోయింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మడికి అవకాశాల్లేక జీరో అయిపోయింది. అదే సమయంలో బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా అక్కడ రాజ్యమేలేస్తోంది. ఇది ఇలా ఉంటే తమన్నా ఈ మధ్యకాలంలో బాగా వెయిట్ పెరిగిపోయింది. ఇప్పటి దాక జీరో సైజు మెయింటైన్ చేసే తమన్నా.. ఇంత భారీగా అందాలను పెంచేయడానికి కారణం ఆమెకు ఉన్న పాడు అలవాటని తన అభిమానులు చెప్పుకొస్తున్నారు.
డైటింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే తమన్నా.. ఆల్కహాల్, స్మోకింగ్ విషయంలో మాత్రం తనను తాను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతుందట. అందుకే ఫుడ్ డైట్ చేస్తున్న, ప్రతీ రోజు జిమ్ చేస్తున్నా వెయిట్ పెరిగిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆమె లవర్ విజయ్ వర్మ కూడా ఆ విషయంలో కంట్రోల్లో పెట్టలేకపోతున్నాడట. తమన్నా తన బరువు కారణంగా కొన్ని మంచి రోల్స్ మిస్ చేసుకునే పరిస్థితి దాపురించిందని కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు.