Sreelela : టాలీవుడ్ క్రష్ శ్రీ లీల ఒక్కరోజు షూట్ కి.. రాకపోతే ఎన్ని కోట్లు నష్టమో తెలిస్తే షాక్ అవుతారు

- Advertisement -


Sreelela : ప్రస్తుతం శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మార్మోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలో శ్రీలీల టాలీవుడ్ క్రష్ అయిపోయింది. కుర్రకారు కళ్లు మూసిన తెరిచిన శ్రీలీల జపం చేస్తున్నారు. శ్రీలీల సినిమా చేస్తే హిట్ గ్యారంటీ అంటున్నారు మేకర్స్. మన తెలుగు హీరోలు కూడా తమ సినిమాల్లో శ్రీలీలే హీరోయిన్ గా కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తన కన్నా డబల్ ఏజ్ ఉన్న హీరోలు సైతం శ్రీలీలనే తమ సినిమాలో నటింపజేయాలంటూ మేకర్స్ పై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే మా రెమ్యునరేషన్ తగ్గించి ఆమెకు ఇచ్చైనా సినిమాలో చేయించాలని కోరుతున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మన శ్రీ లీలాలో ఎంత టాలెంట్ ఉందో.

Sreelela

అయితే ఇలాంటి ఫుల్ బిజీ షెడ్యూల్ గల శ్రీలీల గనుక ఒక్క రోజు షూటింగ్ కి రాకపోయినా.. ఏదైనా హల్త్ ఇష్యూ వచ్చి డుమ్మాకొట్టిన మేకర్స్ కు భారీ స్థాయిలో నష్టాలు వస్తాయన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. శ్రీలీల ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. బిజీబిజీగా ఉండే శ్రీలీల చదువు పనిమీద కానీ.. లేదా వేరే ఏ పని మీద అయినా ఒక్కరోజు షూట్ కి డుమ్మా కొడితే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తాయంటున్నారు. సదరు స్టార్ హీరోల క్వాల్షీట్స్ వేస్ట్ అయిపోతాయంటున్నారు. అందుకే శ్రీ లీల.. నిర్మాతలకి నష్టాలు రాకుండా పగలు షూటింగ్స్.. రాత్రి పరీక్షలకు చదువుకుంటుందంటూ శ్రీలీలను ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల ‘భగవంత్ కేసరి’ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.

శ్రీ లీల
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here