Varun Tej : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి అంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో మొదలైన ఈ ప్రయాణం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్ వరకు వచ్చింది. అయితే వీరిలో యంగ్ హీరోలు అయిన వరుణ్ తేజ్, సాయి తేజ్ పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగా ఫ్యామిలిలో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయనే సమాచారం అందుతుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. ముకుంద మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. వరుసగా కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ తన స్టైల్ లో దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్‌లో ఉన్నాడని కొంతకాలంగా మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. కానీ తాము మంచి స్నేహితులం మాత్రమేనని ఈ జంట పలు సార్లు స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ .. ఇప్పటికీ వాళ్లిద్దరి రిలేషన్‌షిప్ లో వున్నారు అనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. పలు పార్టీల్లో కలిసి కనిపించడం, నిహారిక పెళ్లి వేడుకకు కూడా లావణ్య హాజరవడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది.

కాగా రీసెంట్ గా వరుణ్, లావణ్యల నిశ్చితార్థం వచ్చే నెలలో జరగనుందని బాలీవుడ్ మీడియాలో తాజాగా వార్తలు వెలువడ్డాయి. ఎంగేజ్‌మెంట్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదని.. ఈ ఏడాది లోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా రాసుకొచ్చారు. దాంతో ఇప్పుడు వీరి విషయం హాట్ టాపిక్ గా మారింది. చూడాలి ఇప్పటికైనా వీరు ఈ విషయం గురించి స్పందిస్తారో లేదో అని..
వరుణ్ తేజ్, లావణ్యలు.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్’ లో కలిసి నటించారు. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అంటుంటారు. ఆ తర్వాత అంతరిక్షం అనే చిత్రంలో కూడా నటించారు.