Mega Hero : ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతగా అభివృద్ధిలోకి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచం నలుమూలల జరిగిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతోంది. కొన్ని వార్తలు విన్నప్పుడు మనకు తెలియకుండానే టెన్షన్ మొదలవుతుంది. ఇలాంటి వార్తే ఇప్పుడు అందరికీ నిద్రలేకుండా చేస్తుంది. అదేంటంటే మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త అటు సినీ ఇండస్ట్రీలో ఇటు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఏంటి ఈ మధ్యే దాదాపు చావు అంచులదాకా వెళ్లి బతికి బట్టకట్టిన సాయికి ఏమైంది ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు లేండి.. రీల్ లైఫ్ లో.. ఏంటి హమ్మయ్యా అనుకుంటున్నారా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రో ది అవతార్.. ఇది ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తమిళంలో హిట్ అయిన వినోదయ్ సీతమ్ కు రీమేక్.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజైన టీజర్ వ్యూజ్ రెస్పాన్స్ సాధించింది.

మెగా ఫ్యాన్స్ మామ అల్లుడిని ఒకే స్క్రీన్ పై చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. రీసెంట్గా రిలీజైన మై డియర్ మార్కండేయ పాట వ్యూస్ రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్‌లో సాయి ధరమ్ తేజ్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడట. ఇంట్లో సమస్యలు..ప్రేమ వైఫల్యం.. ఈ బాధలన్నీ తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడట. ఆ సమయంలో పవన్ దేవుడిగా వచ్చి కథను మలుపు తిప్పబోతున్నాడని తెలిసింది. అంతేకాదు ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ నేటి యువతకు ఓ సందేశం ఇవ్వబోతున్నాడు. అయితే ఈ క్లైమాక్స్ సీన్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుందని చిత్ర బృందం చెబుతున్నాయి. సాయిధరమ్ తేజ్ ఆత్మహత్య సీన్ చూసి పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ సమయంలో ఏడ్చేశాడనే వార్త కూడా వైరల్ అవుతోంది.