పూజ హెగ్డే కి ఇంత పెద్ద ప్రాణ హాని పొంచి ఉందా..? అందుకే సినిమాలకు దూరం అయ్యిందా!

- Advertisement -

హీరోయిన్స్ కెరీర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు వరుస అవకాశాలతో దూసుకెళ్లిన కొంతమంది హీరోయిన్లు, ఒకటి రెండు ఫ్లాప్ సినిమాలు పడగానే మాయం అయిపోతూ ఉంటారు. రీసెంట్ గా అలాంటి హీరోయిన్స్ లిస్ట్ జాబితాలోకి పూజా హెగ్డే చేరిపోయింది. నాగ చైతన్య హీరో గా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా పూజా హెగ్డే, ఆ తర్వాత ‘ముకుంద’ సినిమాలో కనిపించింది.

మొదటి రెండు సినిమాలతోనే బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ తో కలిసి ‘మోహెన్ జోడారో’ చిత్రం లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో రెండేళ్లు సినిమాలకు దూరమై మళ్ళీ టాలీవుడ్ లోకి ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

హిట్/ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకానొక దశలో నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ లాగ మారింది. అలాగే బాలీవుడ్ లో కూడా పెద్ద హీరోల సినిమాల్లో వరుసగా హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇవన్నీ హిట్ అయ్యుంటే ఆమె రేంజ్ ఈరోజు మరోలా ఉండేది, కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీంతో పూజా హెగ్డే కి అవకాశాలు బాగా తగ్గిపోయాయని ఇండస్ట్రీ లో ఒక టాక్. అంతే కాదు, అంతకు ముందు ఒప్పుకున్నా ‘గుంటూరు కారం’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి చిత్రాల నుండి కూడా ఈమె తప్పుకుంది.

- Advertisement -

అసలు పూజా హెగ్డే కి ఏమైంది?, కొత్త సినిమాలను ఎందుకు ఒప్పుకోవడం లేదు అని అభిమానులకు అర్థం కాక జుట్టు పీక్కున్నారు. అయితే ఆమె సినిమాల నుండి విరామం కోరుకుంటుంది ఆమె కాళ్ళు బాగా దెబ్బ తినడం వల్లేనట. ఒక షూటింగ్ లో బాగా గాయపడిన పూజ హెగ్డే కి కాళ్ళు బాగా దెబ్బ తిన్నాయి, ఆ తర్వాత ఆమెకి మేజర్ ఆపరేషన్ కూడా చేసారు. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది, పని ఒత్తిడికి లోను అయితే మాత్రం ప్రాణాలకే హాని కలిగే ప్రమాదం ఉందని చెప్పారట డాక్టర్లు. అప్పటి నుండి సినిమాలు తగ్గించేసిందట, ఆమె కొత్త సినిమాలకు ఒప్పుకోకపోవడానికి కారణం ఇదే అని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here