Sreeleela : సినిమా చేయమంటే కండీషన్ల మీద కండీషన్లు పెడుతున్న శ్రీలీల.. హెడ్ వెయిట్ పెరిగిందంటున్న దర్శకనిర్మాతలు

- Advertisement -


Sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల లేకుండా సినిమాలు రావడం లేదు. పెద్ద పెద్ద సినిమాల అన్నింటిలో శ్రీలీలే హీరోయిన్. అమ్మడు సినిమా చేస్తే హిట్ గ్యారంటీ అన్న నిర్ణయానికి వచ్చారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తుంది శ్రీలీల అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్లో టాప్ మోస్ట్ స్థానాన్ని అధిగమించేసింది. ఇటీవల ఆమె నటించిన భగవంత్ కేసరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. త్వరలోనే వైష్టవ్ తేజ్ తో కలిసి ఆదికేశవ సినిమాతో ఆమె ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇటీవల నెలకో శ్రీలీల సినిమా అన్నట్లు ఆమె నటించిన చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

Sreeleela
Sreeleela

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు శ్రీలీల ఫ్యాన్స్. ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాలుగు సినిమాలు హిట్ అయ్యే సరికి అమ్మడికి హెడ్ వెయిట్ పెరిగిందని నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. దీనికి కారణం ఆమె సినిమా ఒప్పుకోవాలంటే కండీషన్ల మీద కండీషన్లు పెడుతుందట. తన దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్క డైరెక్టర్ కి తన కండీషన్లకు ఒప్పుకుంటేనే ఓకే అంటుందట. ఆ కండీషన్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. శ్రీ లీల తన సినిమాలు ఒప్పుకోవడానికి డైరెక్టర్లకి పెట్టే కండిషన్ కాల్ షీట్స్.

Sreeleela Photos

ముందుగా అడిగితేనే కాల్ షీట్స్ ఇస్తుందట.. సినిమా షూటింగ్ మొదలయ్యాక… ఎక్స్ట్రా కాల్షీట్లు అడిగితే ఇవ్వనంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. అంతేకాదు శ్రీ లీల కాల్ షీట్స్ విషయంలో చాలా చాలా కేర్ ఫుల్‎గా ఉంటుందట. తన చేతిలో కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు దాదాపు 12పైగా ఉన్నాయి. దీంతో సినిమా అనుకున్న ప్రకారం షూటింగ్ కంప్లీట్ కాకపోతే.. వేరే సినిమా యూనిట్ ఇబ్బంది పడకూడదని ఇలా కండీషన్లు పెడుతుందట. అందుకే ముందు నుంచే జాగ్రత్త పడుతూ కాల్ షీట్స్ విషయంలో డైరెక్టర్స్ కు తెగేసి చెప్పేస్తుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here