Ravi Teja : ఇప్పుడైతే సోషల్ మీడియా విరివిగా వాడకంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి ఎప్పుడో జరిగిపోయిన విషయాలను కూడా తవ్వి తీసి మరీ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వ్యూయర్ షిప్ కోసం ఇలాంటి ట్రెండ్ కొనసాగిస్తున్నారు కొందరు. పాత తాలూకా జ్ఞపకాలను తవ్విలోడి మళ్లీ ట్రెండ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రస్తుతం రవితేజకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. రవితేజ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడో తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఎంతో కష్టపడి స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కమెడియన్ గా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. తర్వాత హీరోగా ఎదిగారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ అందుకున్నారు.

ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్నాయి. అయితే ఒకప్పుడు రవితేజ అంటే పడని ఓ హీరో అప్పట్లో రవితేజ చేసిన వ్యాఖ్యలపై హర్ట్ అయ్యి తనను చంపేందుకు ఇంటికి గన్ తీసుకొని వెళ్లాడట. ఈ న్యూస్ మరోమారు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రవితేజ ను ..ఓ స్టార్ హీరో చంపేయడానికి ప్లాన్ చేశాడట. అప్పట్లో అతడికి రవితేజకు అసలు పడేది కాదట.

పరోక్షంగా సినిమాల విషయంలో కూడా బాగా గొడవపడేవాడట. రవితేజ ఎదుగుతున్న సందర్భంలోనే తనకు సినిమాలు లేకుండా చేస్తానని పరోక్షంగా ఆ టాప్ హీరో ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చాడట. రవితేజ దూకుడు గురించి అందరికీ తెలిసిందే. దీంతో ‘నన్ను ఎవడు ఏం పీకలేడు” అంటూ కూడా కూసింత ఘాటుగానే ఆయన స్పందించారట. అందుకు హర్ట్ అయిన హీరో ఏకంగా లైసెన్స్ రివాల్వర్ తీసుకుని ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చాడట. అంతే కాకుండా సుపారి కూడా ఇచ్చారట. కేవలం ఇదంతా కట్టుకథ అంటూ గతంలో కొందరు కొట్టిపడేస్తుంటే.. మరికొందరేమో ఇది నిజమే అంటున్నారు. వాస్తవానికి ఆ హీరో రేంజ్ తనకు వార్నింగ్ ఇచ్చే లెవల్లోనే ఉందట.