Soundarya : హీరోయిన్ సౌందర్య చనిపోయే ముందు మాట్లాడిన చివరి మాటలు ఇవే.. దేని గురించి మాట్లాడారో తెలుసా?

- Advertisement -

Soundarya .. ఈ పేరు వినగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడి మదిలో మెదిలేది కట్టు బొట్టుతో ఓ నిండైన రూపం. అంతకంటే నిండైన ముఖం. అందానికే అడ్రెస్ లా ఉండే సహజ నటి.. సౌందర్య. క్యూట్ గర్ల్ లాగా అయినా.. ఒద్దికగా ఉండే ఇల్లాలైనా.. పొగరుగా కనిపించే యువతిగా అయినా.. ఇలా పాత్ర ఏదైనా సరే అందులో ఇట్టే ఒదిగిపోయి.. అది నటన కాదు అంతా నిజమే అనిపించేలా నటించడం కేవలం సౌందర్యకే సొంతం. ఆమె మరణించి నేటికి 20 ఏళ్లు గడిచినా ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఆమె బతికే ఉన్నారు.

Soundarya
Soundarya

కొత్తగా వచ్చిన హీరోయిన్లు ఎవరైనా పద్ధతిగా కనిపిస్తూ.. బాగా నటిస్తే సౌందర్యతో పోల్చేస్తారు. మహానటి తర్వాత అంతటి పాపులారిటీని, ప్రేక్షకుల్లో ప్రేమను పొందిన నటి అంటే సౌందర్య అని చెప్పొచ్చు. మనవరాలి పెళ్లి అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సౌందర్య.. దశాబ్ధ కాలంపాటు వెండితెరను ఏకఛత్రాధిఫత్యంగా ఏలింది. అందాల ఆరబోత, అశ్లీలత జోలికి వెళ్లకుండా కేవలం నటనతోనే ప్రతి ఒక్కరిని మెప్పించింది.

అలా ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో “శివ శంకర్” అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసి అభిమానులను శోకసంద్రంలో ముంచారు. ఇవాళ్టికి ఆమె మరణించి 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆమె చనిపోయే ముందు మాట్లాడిన మాటల గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకు సౌందర్య చివరి మాటలు ఏంటంటే

- Advertisement -

సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సమయంలో ఆమె సోదరుడు కూడా ఆమెతో పాటే ఉన్నారు. ఆమె అప్పటికే రెండు నెలల గర్భవతి. యాక్సిడెంట్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు సౌందర్య తన మేనకోడలికి ఫోన్ చేసి మాట్లాడారట. ఎప్పుడూ నిండైన వస్త్రధారణతో కనిపించే సౌందర్య, చివరి మాటల్లోనూ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే చీరల గురించే ప్రస్తావించారట. తనకు కొన్ని కాటన్ చీరలు కావాలని, వాటితో పాటు కుంకుమ కూడా కావాలని తన మేనకోడలితో చెప్పారట సౌందర్య.

తన సినిమా కెరీర్ మొదట్లో తనకు అవకాశం కల్పించిన  వాళ్లను కూడా సౌందర్య చివరి వరకు మరిచిపోలేదట. తనను చిత్రసీమకు పరిచయం చేసిన తమిళ డైరక్టర్ ఆర్వీ ఉదయ్ కుమార్‌తో, ఆయన భార్యతో చనిపోవడానికి రెండ్రోజుల ముందు కూడా ఫోన్ చేసి తాను గర్భవతిని అయ్యానని, ఎలక్షన్ అయిపోయాక వచ్చి కలుస్తానని చెప్పారట. ఈ విషయాన్ని ఉదయ్​ కుమార్ స్వయంగా తెలిపారు.  దురదృష్టవశాత్తు 2004 ఏప్రిల్ 17న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సౌందర్య. ఆమె భౌతికంగా మనకు దూరమైనా తన సినిమాల ద్వారా ఆ నిండైన ముఖం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here