Kushi Movie Review : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖుషి. లైగర్ ఫ్లాప్‌తో నష్టాల్లో ఉన్న విజయ్.. శాకుంతలంతో అట్టర్ ఫ్లాప్ మూటగట్టుకున్న సమంతకు ఈ సినిమా కాస్త ఊరట కల్పిస్తుందని అందరూ భావిస్తున్నారు. సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెంచేసింది. ఇక పాటలైతే సినిమాకు ఇంకాస్త హైప్‌ను పెంచేశాయి. ఎన్నో అంచనాల మధ్య ఇవాళ విడుదలైన ఖుషి సినిమా మరి విజయ్-సామ్‌లకు హిట్‌ను తీసుకొచ్చిందా..?

కథ.. ఖుషి స్టోరీ కశ్మీరులో షురూ అవుతుంది. బుర్ఖాలో ఉన్న బేగం(సమంత)ను చూసి ఇది నా పిల్ల అని ఫిక్స్ అయిపోతాడు విప్లవ్ (విజయ్ దేవరకొండ). తొలి చూపులోనే బేగం ప్రేమలో పడతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బ్రాహ్మిన్ అయిన ఆరాధ్య సమంత బేగంగా మారాల్సి వస్తుంది. ఆరాధ్యది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. విప్లవ్ ది నాస్తిక కుటుంబం కావడంతో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు.
ఈ ప్రేమ పోరాటంలో పెద్దలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో… పెద్దలను ఎదిరించి ఆరాధ్య-విప్లవ్ లు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. ఆరాధ్య, విప్లవ్‌లు పెళ్లి చేసుకున్న తర్వాత సగటు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు వస్తాయి. ఈ గొడవలు వాళ్లు విడిపోయే వరకు వస్తాయి. అయితే అందరిలాగే వాళ్లూ విడిపోతారా..? లేదా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసుంటారా..? అసలు ఆరాధ్య బేగంలా ఎందుకు మారాల్సి వచ్చింది. అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : ఎప్పుడూ ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్‌గా భావించే శివ నిర్వాణ ఈసారీ తన టార్గెట్‌ను కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమా కశ్మీర్‌లో ఉన్నంత సేపు సగటు తెలుగు లవ్ స్టోరీ మాదిరే ఉంటుంది. కొత్తదనం కనిపించదు. కానీ కశ్మీర్ అందాలు.. సినిమాటోగ్రఫీ బాగుంది. సమంత అందంగా కనిపించింది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటల గురించి. ఖుషి పాటలు చాలా వినసొంపుగా ఆహ్లాదంగా ఉన్నాయి. ఇక కథ కశ్మీర్ నుంచి హైదరాబాద్ చేరిన తర్వాత స్టోరీలో అసలు పాయింట్ మొదలవుతుంది.
జనరల్‌గా ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. ఆ తర్వాత లైఫ్ గురించి సగటు యువత ఆలోచనలు ఈ సినిమాను యూత్‌కి బాగా కనెక్ట్ చేస్తాయి. కానీ 2.40 గంటలు సినిమా కాస్త ల్యాగ్‌గా అనిపిస్తుంది. సినిమాపై ఎడిటర్ కాస్త ఫోకస్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక విజయ్, సామ్‌లు తమ నటనలో ఇరగ్గొట్టేశారు. సగటు భార్యాభర్తల్లో బాగా అలరించారు. వాళ్లని చూస్తుంటే ఒకప్పటి వింటేజ్ లవర్స్ శాలినీ, మాధవ్‌లు కనిపిస్తారు. విజయ్-సామ్ ల కెమిస్ట్రీ అదిరిపోయింది.
ప్లస్ పాయింట్స్ :
విజయ్ దేవరకొండ, సమంత
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ6+6
లోకేషన్లు
మైనస్ పాయింట్స్ : ఎడిటింగ్ , కథనం
సినిమా : ఖుషి
నటీనటులు : విజయ్ దేవరకొండ, సమంత, సచిన్ కేడ్కర్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, అలీ, రాహుల్ రామకృష్ణ, తదితరులు
డైరెక్టర్ : శివ నిర్వాణ
సినిమాటోగ్రఫీ : మురళి
మ్యూజిక్ : అబ్దుల్ వాహబ్
ప్రొడ్యూసర్ : నవీన్, రవి శంకర్
ప్రొడక్షన్ : మైత్రీ మూవీ మేకర్స్
కన్‌క్లూజన్ : ఈ ఖుషీలో సామ్ – విజయ్‌ల రొమాన్స్ చూస్తే యూత్ ఫుల్‌ఖుష్ అవ్వడం ఖాయం
రేటింగ్ : 2.75/5