ఖుష్బూ.. ప్రస్తుతం ఎక్కడ్ చూసినా కూడా ది కేరళ స్టోరీ సినిమా పేరు మారుమోగుతోంది. ఈ సినిమాను విమర్శిస్తున్న వారు ఎంతమంది ఉన్నారో ఈ మూవీని సపోర్ట్ చేస్తూ ఆ సినిమాను కచ్చితంగా చూడాలి అని చెబుతున్న వారి సంఖ్య కూడా అంతే ఉంది. ఈ నేపథ్యంలోనే లవ్ జిహాద్ అనే అంశంపై దేశవ్యాప్తంగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి.. తాజాగా ఈ వివాదం పై సినీ నటి హీరోయిన్ ఖుష్బూ స్పందించింది. లవ్ జీహాద్ అంశంపై ఆమెను టార్గెట్ చేస్తున్న వారికి ఖుష్బూ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది ఖుష్బూ.
ఖుష్బూ గతం లో మతం మారారనే విషయం తెలిసిందే. కొంతమంది కావాలని ఖుష్బూను టార్గెట్ చేస్తూ ది కేరళ స్టోరీ సినిమా వల్ల విమర్శలు చేస్తుండగా ఆమె స్పందించి తనదైన శైలిలో జవాబు ఇచ్చారట.. పెళ్లి కోసం నేను మతం మారినట్టు ప్రచారం చేసేవాళ్లు కొంచెం తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని ఖుష్బూ తెలిపారు. మన దేశంలో ఉన్న వివాహ చట్టం గురించి కచ్చితంగా వాళ్లకు అస్సలు తెలిసుండదని ఖుష్బూ పేర్కొన్నారు. పెళ్లి కోసం నేను ఏ ఒక్క మతానికి మారలేదని మతం మారాలని నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
నా 23 సంవత్సరాల పెళ్లి జీవితం, గౌరవం, నమ్మకం, సమానత్వం ప్రేమకు ప్రతీకగా ఉంటుందని ఖుష్బూ కామెంట్లు చేయడం విశేషం.. ఖుష్బూ స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఖుష్బూ భర్త పేరు సుందర్ అనే విషయం తెలిసిందే. నటి ఖుష్బూ తాజాగా ది కేరళ స్టోరీ మూవీ అందరూ చూడాల్సిన మూవీ అని చెప్పుకొచ్చారు. అబద్ధపు కారణాలతో తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమాపై బ్యాన్ విధించిందని ఆమె చెప్పుకొచ్చారట.. ఖుష్బూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఖుష్బు ప్రస్తుతం కొన్ని పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా చేస్తుంది. అప్పుడప్పుడు జబర్దస్త్ లో కూడా ఆమె మెరుస్తుంది.