Kurchi Madatha Petti : అమెరికా స్పోర్ట్స్ ఈవెంట్ లో ‘కుర్చీ మడత పెట్టి’న మహేశ్ మేనియా

- Advertisement -

Kurchi Madatha Petti : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి సక్సెస్ సాధించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు.

ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి మహేష్ అభిమానుల్లో హైప్ పెరుగుతూనే వచ్చింది. చాలా కాలం తర్వాత మహేశ్ పక్కా మాస్ యాక్షన్ మూవీ చేస్తుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కాకపోతే సినిమాలో ఆశించిన స్థాయిలో స్టఫ్ లేకపోవడంతో జనాలు ఒకింత అసహనం వ్యక్తం చేశారనే చెప్పాలి.

Kurchi Madatha Petti :
Kurchi Madatha Petti :

సినిమాలో ‘కుర్చీని మడతపెట్టి’ అంటూ మాస్ బీట్‍తో మంచి ఊపున్న పాటను పెట్టారు. విడుదలైన దగ్గరనుంచి ఈ పాట రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ప్రపంచమంతా ఈ పాట వైరల్ అవుతూనే ఉంది. కుర్చీని మడతపెట్టి సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంది. మహేష్, శ్రీలీల ఈ సాంగ్ లో మాస్ స్టెప్పులు వేయడంతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.

- Advertisement -

సినిమా వచ్చి మూడు నెలలు అయిన కూడా ఈ పాటకు రీల్స్ చేస్తూ.. నెట్టింట్లో ఇప్పటికీ ట్రెండ్ చేస్తున్నారు.. ఇండియాలోని వేరే రాష్ట్రాల్లో పలు కాలేజీ ఈవెంట్స్ లో ఈ సాంగ్ ని వాడేస్తూ స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. అమెరికా టెక్సాస్ లో నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్ మధ్య బ్రేక్ టైం లో “కుర్చీని మడతపెట్టి” సాంగ్ ని ప్లే చేశారు. ఇంకేముంది అమెరికన్స్ అందరూ వాళ్ల స్టైల్స్ లో ఓ రేంజ్ లో స్టెప్పులేసి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here