Kumari Aunty : కుమారి ఆంటీకి మళ్ళీ కష్టాలు రానున్నాయా!! ప్రైవసీ అంటే తెలియదా వీళ్లకు!!

- Advertisement -

Kumari Aunty : కుమారి ఆంటీ గురించి తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఉండరు. జస్ట్ ఒక్క డైలాగ్ తో ఆంటీ ఫేమస్ అయిపోయారు. ఆమెకు వచ్చిన క్రేజ్ ఎలాంటిది అంటే ఏకంగా సీఎంయే ఆమె దగ్గరకు వెళ్తానని చెప్పే రేంజ్ ఆమె వెళ్లారు. ఆమెకు వచ్చిన పాపులారిటీ ఆమెకు కష్టాలను కూడా తెచ్చింది. ఒక టైం ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర క్రౌడ్ పెరగడంతో ఆమె షాప్ ను మూయించేశారు. ఇలా ఆమె ఒక్కసారి ఫేమస్ ఐన తరువాత ఆమెకు కష్టాలే ఎక్కువగా వచ్చాయి. ఫేమస్ అయినప్పటి నుండి ఆమెకు పర్సనల్ లైఫ్ అనేది లేకుండా పోయింది. ఆమె ఇక్కడికి వెళ్లినా జనాలు గుర్తు పట్టడంతో ఆమె ఏ పని కూడా చేయలేకపోతోంది.

kumari aunty
kumari aunty

అయితే కొంతకాలం ఆమెను అందరు మర్చిపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి కుమారి వచ్చారు. ఒక బంగారు షాప్ లో గోల్డ్ కొంటూ కుమారి ఆంటీ కనిపించారు. అక్కడా కూడా ఆమెకు ప్రైవసీ ఇవ్వకుండా జనాలు ఆమెను కెమెరాలతో చుట్టూ ముట్టారు. ఇప్పుడు గోల్డ్ ఎందుకు కొంటున్నారు, ఎలా కొంటున్నారు అంటూ ఆమెను ప్రశ్నలతో విసిగించేశారు. కుమారి ఆంటీ మాత్రం ఎప్పటి లానే నవ్వుతూ అన్నింటికీ సమాధానం ఇచ్చారు. ఆ గోల్డ్ ను తాను ప్రతి నెలా డబ్బులు పోగు చేసుకుంటూ కొన్నానని చెప్తున్నారు. అయితే వీడియో ప్రమోషన్స్ లలో భాగంగా చేస్తున్నారో లేదా నిజంగా ఆమె గోల్డ్ కొనడానికి వెళ్తే జనాలు విసిగిస్తున్నారో తెలియదు.

ఒకవేళ ఇదంతా ప్రమోషన్స్ లలో భాగంగా ఇదంతా చేస్తుంటే ఏమి ప్రాబ్లెమ్ లేదు కానీ ఒకవేళ ఆమెను జనాలు పర్సనల్ గా ఇలా ఇబ్బందులు పెడితే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఆమెకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేసే రైట్ ఎవ్వరికి లేదు. ఇదే పెద్ద సెలెబ్రెటీలను ఇలానే ఇబ్బంది పెడుతారా ఈ జనాలు, లేదుగా. అందుకే కుమారి అంటీకి కూడా పర్సన్ స్పేస్ ను రెస్పెక్ట్ చెయ్యాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here