టాలీవుడ్లో డిమాండ్ ఉన్న నటి కృతి శెట్టి(Krithi Shetty). ఎన్నో విభిన్నమైన పాత్రలను అంగీకరిస్తూ దూసుకెళ్తోంది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆమె నటించిన ‘కస్టడీ'(Custody) చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో కృతి శెట్టి పలు విషయాల గురించి మాట్లాడింది. సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) గురించి కృతి శెట్టి చెప్పిన మాటలు చర్చకు దారితీశాయి. సమంతకు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్ల అనుభవం ఉంది. కృతి శెట్టి అనుభవం తక్కువే. అయినప్పటికీ కృతి శెట్టి కొన్ని కామెంట్స్ చేసింది.
ఇటీవల ఓ ఇవటర్వ్యూలో పాల్గొన్న కృతిని’ఊ అంటావా..’లాంటి పాట ఆఫర్ వస్తే ఒప్పుకుంటావా అని కృతి శెట్టిని అడగగా ‘నో’ చెప్పింది. ‘ప్రస్తుతం నేను అలాంటి పాత్రను అంగీకరించడం లేదు. అలాంటి పాత్రలో నటించడం నాకు కష్టంగా ఉంటుంది’ అని తెలిపింది. అయితే ఆ పాటలో సమంత(Samantha) నటన కృతికి బాగా నచ్చిందట. ఐటమ్ సాంగ్స్ లో డ్యాన్స్ విషయంలో నటీమణులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకప్పుడు ఐటమ్ డ్యాన్స్ చేయడానికి విడివిడిగా నటీమణులు ఉండేవారు. ఆ తర్వాత కాలం మారింది. స్పెషల్ సాంగ్ లో హీరోయిన్లు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.
ప్రస్తుతం కృతి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. సమంత ఫ్యాన్స్ ఆమెపై కోపడుతున్నారు. నేను సమంత లాంటి దాన్ని కాదు అని కృతి చెప్పకనే చెప్పింది. మరి ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు. అసలే ఈ అమ్మడు కస్టడీలో నాగ చైతన్యతో కలిసి చేసిన రోమాన్స్ కు థియేటర్లలో ఈలలతో మారుమోగాయి. ఇక కస్టడీ సినిమా(Custody Cinema) విషయానికి వస్తే.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ముఖ్యమంత్రి అవినీతి, అక్రమాలకు సాక్షిగా నిలిచిన ఓ నేరస్తుడిని కోర్టులో అప్పగించే క్రమంలో ఓ నిజాయితీపరుడైన పోలీస్ కానిస్టేబుల్ సాగించిన ప్రయాణం నేపథ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ సినిమాను తెరకెక్కించారు.