Kriti Shetty : బేబమ్మది ఒరిజినల్ కాదా..అది ఎవరిదో తెలుసా?

- Advertisement -

Kriti Shetty : టాలివుడ్ లో మెగా హీరోయిన్ కృతి శెట్టి గురించి తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకుల అందరికి తెలుసు.. మొదటి సినిమా తో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది..దాంతో వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి..అయితే ఈ క్యూటీ వాయిస్ సినిమాలో ఎంత బాగుంటుందో అందరికి తెలుసు..కొన్ని సీన్లకు ఆమె వాయిస్ హైలెట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అయితే నిజానికి అది ఆమె ఒరిజినల్ వాయిస్ కాదు..ఆమెకు ఒకరు డబ్బింగ్ చెబుతున్నారు.. ఇప్పటి వరకూ సినిమాలు హిట్ టాక్ అందుకోవడానికి ఆ గొంతు ఒక కారణం అని చెప్పొచ్చు..

kriti shetty
kriti shetty

లెక్కల మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ రావడానికి కృతి శెట్టి కూడా ఒక కారణం అని చెప్పాలి. సినిమా నుండి విడుదలైన ట్రైలర్, పాటల్లో కృతి శెట్టి హావ భావాలు ప్రేక్షకుల మదిని దోచేశాయి. దాంతో సినిమా విడుదలకు ముందే కృతి శెట్టికి మంచి క్రేజ్ లభించింది. ఈ సినిమాలో బేబమ్మగా నటించిన కృతి శెట్టి తన డైలాగులతో.. తన క్యూట్ వాయిస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా జ్వరం కావాలా అంటూ కుర్రాళ్లకు మత్తేక్కించింది.

kriti shetty Photos
kriti shetty photos

కాగా, కృతి శెట్టి అందంగా ఉండటమే కాదు ఆమె గొంతు కూడా అంతే అందంగా ఉంటుందని ప్రతి ఒక్కరు తెగ పొగిడేస్తూ ఉంటారు. అయితే ఈ అందమైన వాయిస్ కృతి శెట్టిది కాదు కృతి శెట్టి కి డబ్బింగ్ ఆర్టిస్టు శ్వేతా వాయిస్ ను అందించింది. ఈ సినిమాకే కాకుండా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాకి కూడా శ్వేతనే వాయిస్ ని ఇచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే శ్వేతా కేవలం కృతి శెట్టి కి మాత్రమే కాదు కాజల్ అగర్వాల్ కి కూడా డబ్బింగ్ చెప్పిందని తెలుస్తుంది.

- Advertisement -

నివేదా పేతురాజుకు కూడా ఈమె డబ్బింగ్ చెప్పింది. నిజానికి సినీ పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హీరోలు.. హీరోయిన్ల కష్టం తెరపైన కనిపిస్తే.. డబ్బింగ్ ఆర్టిస్టుల కష్టం తెర వెనుక కనిపిస్తుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎప్పుడు గెలుస్తాడు అంటే.. తన వాయిస్ తో సినిమాలలో వచ్చే డైలాగ్లకు ప్రేక్షకులు మంత్ర ముద్దులవుతారో అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టు గెలిచినట్టు..సాయి కుమార్,రవి శంకర్ వీరంతా ఒకప్పుడు డబ్బింగ్ చెప్పినవారే..తర్వాత నటులుగా మారారు..నిజానికి కృతి బయట వాయిస్ కూడా దాదాపు అలానే ఉండటంతో అందరు ఆమెది ఒరిజినల్ వాయిస్ అనుకున్నారు..ప్రస్తుతం ఈ అమ్మడు రెండు మూడు సినిమాలకు సైన్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here