Kriti Sanon : బాలీవుడ్ నటి కృతి సనన్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం కావస్తోంది. ఈ పదేళ్లలో ఆమె కెరీర్లో పెద్దగా ఆశించిన హిట్స్ ఏమీ లేవు. అయినా ఆమెకు జాతీయ అవార్డు లభించింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన హీరోయిన్లకు కూడా ఈ అవార్డు అందలేదు. అలాంటి హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. గత 4-5 సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద ఆమె పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కృతి సనన్ బాక్సాఫీస్ వద్ద తన 9 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా సూపర్‌హిట్ కాలేదు.
హీరోపంతి, లుకా చుప్పి, హౌస్‌ఫుల్ 4 వంటి చిత్రాలలో కొన్ని ఫర్వాలేదు అనిపించుకున్నాయి. ఇది కాకుండా ఆమె నటించిన పానీపత్, బచ్చన్ పాండే, షెహజాదా, అర్జున్ పాటియాలా, ఆదిపురుష్ సినిమాలు వసూళ్లు సాధించలేకపోయాయి. టైగర్ ష్రాఫ్‌తో ఆయన తీసిన గణపత్ సినిమా కూడా ఏ మాత్రం సత్తా చూపడం లేదు. ఈ సినిమా 4 రోజుల్లో 8.50 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అది కూడా దసరా సెలవుల కారణంగానే సినిమాకు ఆ మాత్రం వసూళ్ల వచ్చాయంటున్నారు.
కృతి నటనలో లోపం లేదు. లుకా చుప్పి చిత్రంలో కార్తీక్ ఆర్యన్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా పండింది. ఇది కాకుండా హీరోయిన్ కృతి బరేలీ కి బర్ఫీ, రాబ్తా, హీరోపంతిలో బాగా నటించింది. మిమీ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు జాతీయ చలనచిత్ర అవార్డు కూడా లభించింది. దీనితో పాటు కొంతకాలం క్రితం విడుదలైన ప్రభాస్ చిత్రం ఆదిపురుష్‌లో ఆమె సీత పాత్రలో కనిపించింది. ఈ పాత్రలో తన నటనకు ప్రశంసలు దక్కాయి.
అయితే పాపం రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అని తేలిపోయింది. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 55.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. నటీమణులు తమ సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఎక్కువ దృష్టిపెట్టి మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుని వారికి సరిపోయే పాత్రలు చేస్తే విజయాలు వాటంతట అవే వస్తాయి. కృతి ప్రస్తుతం ఈ అవార్డు సాధించడంతో పరిశ్రమలోని టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.