Krithi Shetty : ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న బబ్లీ బ్యూటీ కృతి శెట్టి. వీడు ముసలోడు కావొద్దే అంటూ చెప్పిన డైలగ్ కుర్రాకారుకు తెగనచ్చేసింది. దీంతో అమ్మడు కుర్రాళ్ల కలల రాణిగా నిలిచిపోయింది. బేబమ్మగా ముద్దుగా పిలుచుకుంటూ ఆరాధిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో స్టార్ రేంజ్ హీరోయిన్ అయిపోయింది. కాకపోతే తర్వాత తనకేదో దిష్టి తగిలినట్లు చేసిన వరుస సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం కృతి శెట్టి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు.

అంతే కాకుండా ఈమెకు వచ్చిన అవకాశాలన్నీ రీసెంట్ టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఎగరేసుకుపోతుంది. దీంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. మొదట్లో తను చేసిన వరుస సినిమాలు హిట్ గా నిలవడంతో ఇండస్ట్రీని ఏలుతుందని అనుకున్నారు అంతా.. కానీ ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అన్న నానుడి అతికినట్లు కృతికి శెట్టికి సరిగా సరిపోయింది. చేతిలో సినిమాలు లేక కెరీర్ మొత్తం తలకిందులైపోయింది. ఇక ఇటీవల అమ్మడు సోషల్ మీడియాలో కూడా తన హాట్ నెస్ పెంచింది. అందాలు ఆరబోసిన ఫోటోలు షేర్ చేస్తూ ఛాన్స్ ల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

ఇది ఇలా ఉంటే కృతిశెట్టి చేసిన పనికి తన తల్లి చెంప చెల్లుమనిపించిందట.. దాంతో పాటు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇటీవల కోలీవుడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా కృతి శెట్టి కొన్ని కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ కాస్త అటూ ఇటుగా మెగా హీరోలను ఉద్దేశించివిగా అనిపించాయి. దీంతో మెగా ఫ్యామిలీ కృతిశెట్టిపై కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు ఫిలింనగర్లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వార్త కృతి.. తల్లికి తెలియడంతో అంత పెద్ద స్టార్ హీరోలపై ఇన్ డైరెక్ట్ గా తప్పుడు కామెంట్లు చేస్తావా.. నీకు అసలు బుద్ధుందా.. మరో సారి ఇలాంటి కామెంట్లు చేయవద్దు.. నీ హద్దులు మీరి ఎప్పుడూ ఇలాంటి కామెంట్స్ చేయకు అని వార్నింగ్ ఇచ్చిందట. దీనికి కృతిశెట్టి మాత్రం తాను మాట్లాడింది తనకు కరెక్ట్ గానే అనిపించింది అన్నందుకు తన తల్లి చెంపచెల్లుమనిపించిందట.