Krithi Shetty ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఉప్పెనలా దూసుకొచ్చింది కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే.. అది కూడా మూవీ రిలీజ్ కు ముందే ఓవర్ నైట్ స్టార్ అయింది. తొలి చిత్రం రిలీజ్ కు ముందే అరడజను అవకాశాలను చేజిక్కించుకుంది. అలా వరుస సినిమాలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

సోషల్ మీడియాలోనూ కృతి తన హవా చాటుతుండేది. గత కొంతకాలంగా బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ వరుస ఫొటోషూట్లు చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది. తాజాగా కృతి బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో కనిపించింది. టైట్ ఫిట్ డ్రెస్సులో తన అందాలను ఆరబోసింది. ఈ డ్రెస్సులో కృతిని చూసిన కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు.

ఈ మధ్య కృతి కాస్త బోల్డ్ గా తయారైందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. టైట్ ఫిట్ డ్రెస్సుల్లో గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్ల మనసు కాజేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సులో కృతి థైస్ షో చేస్తూ రెచ్చిపోయింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది. కృతి ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక కృతి సినిమాల విషయానికి వస్తే.. ఉప్పెన తర్వాత ఈ బ్యూటీ నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్‘, నాగ చైతన్య సరసన ‘బంగార్రాజు’ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నితిన్, రామ్ లతో కూడా సినిమాలు చేసింది. కానీ అవి అంతగా హిట్ కాలేదు. తాజాగా కృతి శెట్టి.. నాగచైతన్యతో మరోసారి జత కడుతోంది. కస్టడీ సినిమాలో ఈ ఇద్దరు కలిసి మరోసారి నటిస్తున్నారు.

కృతి శెట్టి పుట్టి పెరిగింది ముంబైలోనే. వీళ్ల నాన్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. తల్లి ఫ్యాషన్ డిజైనర్‌గా పలు సినిమాలకు పని చేశారు. కృతి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు డిమాండ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చూస్తోంది కృతి. అందుకే వరుస సినిమాలు, యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.