Krithi Shetty : బేబమ్మ మనసు బంగారం.. వాళ్లని కలవడమే తన అదృష్టంగా భావిస్తోంది ఈ బ్యూటీ..

- Advertisement -

Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైంది కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది.. ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఆ తరువాత బేబమ్మ వరుస సినిమాలను అందుకుంది.. మొదటి సినిమాతోనే భారీ ఫాలోయింగ్ అంతం చేసుకుంది..

Krithi Shetty
Krithi Shetty

బేబమ్మ శ్యామ్ సింగరాయ్, బంగారు రాజు సినిమాలతో వరుసగా డబల్ హిట్స్ అందుకుంది . అయితే వరుస విజయాలతో దూసుకెళ్తున్న కృతి శెట్టి ఇప్పుడు వరుస ప్లాపులను ఎదుర్కొంటుంది. ఇటీవల నితిన్ సరసన నటించిన మాచర్ల నియోజకవర్గం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ప్రస్తుతం కృతి శెట్టి నాగచైతన్య సరసన కస్టడీ సినిమాలో నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అయితే ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది.. తాజా సమాచారం ప్రకారం కృతి శెట్టి యంగ్ హీరో సర్వనంద్ సరసన నటించనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

- Advertisement -
Krithi Shetty Photos

కృతి శెట్టి సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటుంది. అక్కడ కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేస్తుంది. కృతి శెట్టికి సోషల్ మీడియాలో 4.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో కృతి శెట్టి తన అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. తాజాగా కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోతో పాటు ఆమె రాసిన నోట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. బేబమ్మ మనసు బంగారం అంటూ పొగడ్తలతో ముంచేత్తుతున్నారు నేటిజన్స్..

దేవనార్ ఫౌండేషన్ ఫోర్ ది బ్లైండ్ లోని ఏంజెల్స్ ను ఈరోజు నేను మీట్ అయ్యాను . ఆ పిల్లలు నిజంగా ఎంత పద్ధతిగా ఉన్నారో.. అంతకంటే ఎక్కువ బ్రిలియంట్ అండ్ టాలెంటెడ్. అలాంటి పిల్లల్ని నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా ఈరోజు నేను వాళ్ళని చూడటం చాలా ఆనందంగా ఉంది. వాళ్ల దగ్గర నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి . అంతేకాకుండా నిజమైన హీరోలు డాక్టర్ సాయి బాబా గౌడ్ ఆయన భార్య జ్యోతి సాయి బాబా గౌడ్. ఇలాంటి ఫౌండేషన్ ఫ్యాషన్ తో రన్ చేస్తున్న వాళ్లని మీట్ అవ్వడం నిజంగా వండర్ఫుల్.. నిజమైన పర్సన్స్ ని ఈరోజు మీట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ .. ఓ ఫోటోను షేర్ చేసింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here