Krithi Shetty : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ , క్రేజ్ ని సంపాదించిన నటి కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో ఈ అమ్మాయికి వచ్చిన యూత్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇంటర్ చదువుకునే విద్యార్థులు మొత్తం ఈమె ఫ్యాన్స్ అయ్యుంటారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్రేజ్ అయితే ఉంది కానీ, దానిని సరిగా ఉపయోగించుకోవడం లో మాత్రం ఈ హీరోయిన్ డిజాస్టర్ అయ్యింది అనే చెప్పాలి.

ఉప్పెన తర్వాత ఈమె చేసిన సినిమాలలో ఇప్పటి వరకు కేవలం ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ ఒక దాని తర్వాత ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. దీంతో ఈ హీరోయిన్ కి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. నిర్మాతలు ఈమెని తమ సినిమాలో తీసుకుంటే కచ్చితంగా ఫ్లాప్ అవుతుందేమో అనే భయం కి వచ్చేసారు.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీరు ఈమధ్య కాలం లో చాలా సూపర్ హిట్ సినిమాలు మిస్ అయ్యారట కదా, అయ్యో ఈ సినిమా మిస్ అయ్యానే అనే ఫీలింగ్ ఏ చిత్రం కి అయినా కలిగిందా అని ఒక యాంకర్ కృతి శెట్టి ని అడుగుతుంది.

దానికి కృతి శెట్టి సమాధానం ఇస్తూ ‘అలా ఏమి లేదు కానీ, బాలయ్య గారి ‘భగవంత్ కేసరి’ చిత్రం లో నాకు అవకాశం వచ్చింది. కానీ నేను వేరే సినిమాకి ఇచ్చిన కమిట్మెంట్స్ కారణంగా మిస్ అయ్యాను. ఈ సినిమాని వదులుకున్నందుకు నేను ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ పాత్ర ని తర్వాత శ్రీలీల ఒప్పుకొని చేసింది. కానీ కృతి శెట్టి ఈ క్యారక్టర్ ఒప్పుకొని ఉంటే శ్రీలీల కంటే ఎంతో అద్భుతంగా నటించి ఉండేది అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.