NTR 30 : #RRR సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకొని గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఆ చిత్రం తర్వాత కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసారు,కానీ ఎదో ఒక కారణం చేత వాయిదా పడుతూ వచ్చింది.అయితే ఎట్టకేలకు ఈ సినిమా నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీ ముహూర్తపు కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

ఈ పూజా కార్యక్రమాలకు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు మరియు దర్శకులు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.ఈ సందర్భంగా ఈ మూవీ గురించి కొరటాల శివ మాట్లాడిన కొన్ని మాటలు అభిమానుల్లో ఒక రేంజ్ ఉత్సాహం ని నింపాయి.ఇన్ని రోజుల వారి ఎదురు చూపులకు ఈ సినిమా ఒక విందు భోజనం లాగా ఉండబోతుంది అని ఫ్యాన్స్ కి అర్థం అయిపోయింది.

కొరటాల శివ మాట్లాడుతూ ‘అభిమానులందరికీ ఈ సందర్భంగా ఒక మాట ఇస్తున్నాను, ఈ చిత్రం నా కెరీర్ లోనే బెస్ట్ వర్క్ అవుతుంది. ఎన్టీఆర్ ని ఎంత మాస్ గా అయితే చూడాలని కోరుకుంటున్నారో, అంత మాస్ గా ఈ చిత్రం లో చూపించబోతున్నాను, ఆయనలోని ఒక క్రూర మృగాన్ని చూస్తారు.ఈ కథలో మనుషుల కంటే మృగాలు ఎక్కువ వుంటారు, దేవుడు అంటే భయం లేదు చావు అంటే భయం లేదు కానీ ఒకే ఒక్కటి అంటే భయం ఆ భయం ఏంటో మీకు తెలిసే ఉంటుంది’ అంటూ కొరటాల శివ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆచార్య వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న చిత్రమిది.

ఆచార్య సినిమాతో కొరటాల శివ కి వచ్చిన విమర్శలు మామూలివి కాదు. కొరటాల శివ అసలు దర్శకత్వం అనేదే మర్చిపోయ్యాడా అని అందరూ అనుకున్నారు. అందుకే ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే కసితో ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు కొరటాల శివ. ఇందుకోసం ఆయన ఏడాది సమయం తీసుకున్నాడు. మరి ఆయన అనుకున్న విధంగానే ఈ చిత్రం తీసి కనీవినీ ఎరుగని కం బ్యాక్ ఇస్తాడో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.
