Abbavaram : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయం లోనే మంచి గుర్తింపుని దక్కించుకున్న హీరోలలో ఒకడు కిరణ్ అబ్బవరం. ఇతనికి ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ హిట్స్ ఏమి లేవు. కానీ ఇతని డైలాగ్ డెలివరీ మరియు నటన కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ‘రాజావారు రాణివారు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత ‘SR కల్యాణ మండపం’ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

ఆ తర్వాత ఆయన చేసిన పలు సినిమాలకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, కిరణ్ ని మరో లెవెల్ కి మాత్రం తీసుకెళ్లలేకపోయాయి. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘రూల్స్ రంజన్’ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీంతో కిరణ్ అబ్బవరం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ లో ఒక టాక్ వినిపిస్తుంది.

అదేమిటి అంటే కొంతకాలం వరకు ఆయన సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని అనుకుంటున్నాడట. తన స్నేహితులతో కలిసి సొంత ఊరులో వ్యాపారం పెట్టి కెరీర్ లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడట. సినిమాల్లో ఆయనకీ ఆఫర్స్ రాకుండా అయితే లేవు, ఇప్పటి మంచి డిమాండ్ ఉన్న హీరోనే. కానీ తనని వేరే లెవెల్ కి తీసుకెళ్లే సబ్జెక్టు దొరికేంత వరకు ఎన్ని కథలు వచ్చినా రిజెక్ట్ చేస్తూనే ఉంటాడట.

ఈసారి కొడితే పెద్ద బ్లాక్ బస్టర్ నే కొట్టాలి, లేకపోతే సినిమాలు మానుకోవాలి అనే మైండ్ సెట్ లోకి వచేసాడట కిరణ్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. ఇకపోతే ఇతను తనతో కలిసి నటించిన హీరోయిన్ రహస్య గోరఖ్ తో చాలా కాలం నుండి కిరణ్ అబ్బవరం ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టు టాక్.