ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న కమెడియన్స్ లో ఒకరు పంచ్ ప్రసాద్. ఇతను వేసే పంచులకు మామూలు క్రేజ్ ఉండదు. అయితే గత కొంత కాలం నుండి ఇతను తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతున్నాడు. అతని రెండు మూత్ర పిండాలు చెడిపోవడం తో ప్రతీ రోజు డాక్టర్లు ఇచ్చే మందులు వాడుతూ, డయాలసిస్ కూడా చేయించుకుంటున్నాడు. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరో పక్క జబర్దస్త్ లో స్కిట్స్ మొన్నటి వరకు వేస్తూ వచ్చాడు.

అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి మరింత విషమించింది. నిన్నమొన్నటి వరకు పైకి లేచి తిరిగే ఈయన, ఇప్పుడు మంచానికే పరిమితం అయ్యాడు. డాక్టర్లు వెంటనే కిడ్నీ మార్పిడి చెయ్యకపోతే పంచ్ ప్రసాద్ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేశారట. ఇప్పటికిప్పుడు కిడ్నీ మార్పిడి చెయ్యాలంటే చాలా ఖర్చు అవుతుంది,ఇది వరకు జబర్దస్త్ కుటుంబం ఎంతో కొంత సహాయం చేస్తూ, దానికి తోడు అభిమానులు కూడా ఒక చెయ్యి వేసి పంచ్ ప్రసాద్ కి డబ్బు సహాయం చేసి ట్రీట్మెంట్ అందించారు.

కానీ ఇప్పుడు ఆయన చివరి స్టేజిలో ఉన్నాడు, మూత్ర పిండాలు మరింత డ్యామేజీ అయ్యాయి, ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మనం ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ. కాబట్టి దయచేసి నాకు సహాయం చెయ్యండి అంటూ పంచ్ ప్రసాద్ చేతులు జోడించి సోషల్ మీడియా లో అభిమానులను ప్రాధేయపడుతూ అడిగిన విధానం చూస్తే ఏడుపు ఆపుకోలేరు. అయితే అప్పట్లో పంచ్ ప్రసాద్ ఆరోగ్యం బాగుపడేంత వరకు అతని బాధ్యతలు మొత్తం నేనే చూసుకుంటాను అని కిరాక్ ఆర్ఫీ హామీ ఇచ్చాడు. పంచ్ ప్రసాద్ సహాయం కోసం అతని దగ్గరకి వెళ్తే కిరాక్ ఆర్ఫీ ఆ మాట ఇచ్చాడు.

కానీ ఇప్పటి వరకు కిరాక్ ఆర్ఫీ ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని సోషల్ మీడియా లో వినిపిస్తున్న రూమర్. కిరాక్ ఆర్ఫీ జబర్దస్త్ షో నుండి బయటకి వచ్చి ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అనే రెస్టారంట్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రెస్టారంట్ పెద్ద సక్సెస్ అయ్యి, కోట్ల రూపాయలలో లాభాల్ని ఆర్జిస్తున్నాడు కిరాక్ ఆర్ఫీ, అంత డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఎంతో కొంత సహాయం చెయ్యొచ్చు కదా, ఒకవేళ సహాయం చెయ్యకపోతే సైలెంట్ గా ఉండాలి, చేస్తాను అని పబ్లిసిటీ కొట్టుకోవడం ఎందుకు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
