వెంకటేష్ తో నాకు అన్నీ అయ్యాయి.. నా ఫస్ట్ హీరో అతడే సంచలన కామెంట్స్ చేసిన కుష్బూ

- Advertisement -

ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బూ ఇప్పటికీ సహాయ నటి పాత్రల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.ఓ పక్క రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న ఈ ముంబై బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఒకానొక సమయంలో ఈమెకు గుడి కట్టారు అంటే ఈమె అప్పటి కుర్రకారుని తన గ్లామర్ తో ఏ స్థాయిలో అలరించి కలల రాకుమారిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కుష్బూ సన్నబడి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

కుష్బూ
కుష్బూ

ఇక కుష్బూ కు వెంకటేష్ కు ఉన్న బంధం అందరికీ తెలుసిందే. తాజాగా ఆయనపై కుష్బూ సంచలన కామెంట్స్ చేసింది. వెంకటేష్ అంటే నాకు చాలా సెంటిమెంట్. నా ఫస్ట్ హీరో అతడు, అంతే కాదు, నా ఫస్ట్ ఫ్రెండ్ కూడా. నేను వెంకీ ప్రతి రోజూ మాట్లాడుకోం. కానీ నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే వెంకీ నాతో ఉంటాడు. సెంటిమెంటల్ అనే పదంలో వెంకటేష్ సెంటి పార్ట్ అయితే, నేను మెంటల్ పార్ట్. అంతలా కలిసిపోతాం. 80ల నాటి హీరోహీరోయిన్లు 32 మంది ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారట. అందులో చిరంజీవి, రజనీకాంత్ నుంచి చాలామంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారట. పొద్దున్న లేస్తే ఏం చేశాం, ఏం తిన్నామనే చిన్న చిన్న విషయాల్ని కూడా అందులో షేర్ చేసుకుంటారట. ఆ గ్రూప్ లో వెంకీ ఉన్నాడు కానీ, పెద్దగా రెస్పాండ్ అవ్వడని కంప్లయింట్ చేస్తోంది.

Kushboo Venkatesh

ఇక కుష్బూ రామబాణం లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 1986 లో కె.రాఘవేంద్ర రావు గారు వెంకటేష్ ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్ట్ చేసిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.అందమైన భామలను టాలీవుడ్ కు హీరోయిన్లుగా పరిచయం చేయడం కె.రాఘవేంద్ర రావు గారి తర్వాతే ఎవ్వరైనా..! అటు తర్వాత ‘కెప్టెన్ నాగార్జున’ ‘త్రిమూర్తులు’ ‘భారతంలో అర్జునుడు’ ‘కిరాయి దాదా’ ‘మారణ హోమం’ ‘చిన్నోడు పెద్దోడు’ ‘శాంతి క్రాంతి’ ‘పేకాట పాపారావు’ ‘స్టాలిన్’ ‘యమదొంగ’ ‘కథానాయకుడు’ ‘అజ్ఞాతవాసి’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది మెప్పించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here