కీర్తి సురేష్ పెళ్లి చేసుకునేది అతన్నేనా?.. అతని బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

- Advertisement -

కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.. స్టార్ హీరోల సరసన నటించింది.. ఇటీవల దసరా సినిమాలో నటించింది.. నాని హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.. అయితే సినిమాతో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో రూమర్స్ ను అందుకుంటుంది.. గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో ఎటువంటి నిజం లేదని ఆమె తల్లి కొట్టిపడేసింది.. అయిన వార్తలు వినిపిస్తున్నాయి..

కీర్తి సురేష్
కీర్తి సురేష్

అతను వ్యాపార వేత్త అని తెలుస్తుంది.. తన క్లాస్ మేట్ అయిన వ్యాపారవేత్తను కీర్తి సురేష్ వివాహం చేసుకుబోతున్నారనే ప్రచారం జరిగింది. కేరళలో రిసార్ట్స్ బిజినెస్ చేస్తున్న అతన్ని కీర్తి సురేష్ ప్రేమించారు. ఇరు కుటుంబాల సభ్యులు కూడా ఈ పెళ్లికి అంగీకారం తెలిపారంటూ వార్తలు వినిపించాయి అయితే ఈ కథనాలను కీర్తి సురేష్ తల్లి ఖండించారు. కీర్తి సురేష్ పెళ్లి కుదర్లేదు. తాను ఎవరితో రిలేషన్ లో లేదన్నారు.. ఇక తాజాగా మరోసారి ఆమె పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి..

ఓ వ్యక్తితో కీర్తి సురేష్ కలిసి ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అతనితో అత్యంత సన్నిహితంగా కీర్తి సురేష్ ఉన్న నేపథ్యంలో అతడు ఆమె లవర్.. అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి..ఆయన పేరు పర్హాన్ బీన్ లియాకత్.. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి అని సమాచారం. కీర్తి సురేష్ ఇతనిలో రిలేషన్ లో ఉన్నారు. త్వరలో వివాహం అంటూ కథనాలు వెలువడుతున్నాయి. కానీ దీని పై ఎటువంటి ప్రకటన రాలేదు.. ప్రస్తుతం ఈ అమ్మడు 7 సినిమాల్లో నటిస్తుందని టాక్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. రివాల్వర్ రీటా, రఘుతాతా చిత్రాల్లో కీర్తి సురేష్ నటిస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here