Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్.. వరుడు ఇతడే

- Advertisement -

Keerthy Suresh మహానటి సినిమాతో అందరి మనసులు దోచేసింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తెలుగు, అటు తమిళంలో స్టార్ హీరోల స‌ర‌స‌న క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టిస్తూనే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లోనూ ఆమె న‌టిస్తుంది. వివాదాల‌కు దూరంగానే ఉండే ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు గత కొద్దిరోజులుగా ప్రేమలో మునిగి తేలుతుందని త్వరలోనే పెళ్లి చేసుకోనుందని అంటున్నారు. అందుకే ఈ భామ కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచేసిందనీ కామెంట్స్ చేస్తున్నారు.

Keerthy Suresh
Keerthy Suresh

సర్కారు వారి పాట చిత్రంలో అల్ట్రా మోడ్రన్ కన్నింగ్ లేడీ పాత్ర పోషించిన కీర్తి దసరా చిత్రంలో ఇన్నోసెంట్ విలేజ్ గర్ల్ రోల్‌లో అద‌ర‌గొట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన కీర్తి రెండు దశాబ్దాల ప్రస్థానం పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఆమె ప్రేమ‌, పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కీర్తి సురేష్ తన క్లాస్ మేట్ ని వివాహం చేసుకుంటున్నారంటూ గ‌తకొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రిసార్ట్స్ ఓనర్ అయిన అతనితో కీర్తి సురేష్ రిలేష‌న్‌లో ఉంద‌ని, పెద్దలు వీరికి పెళ్ళికి అంగీకారం తెలిపారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిని కీర్తి త‌ల్లిదండ్రులు ఖండించారు.

Keerthy

కానీ తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి ఇన్ స్టాలో పెట్టిన ఎమోజీ చూసి పెళ్లికి ముందు అంతా ఇలానే అంటారంటూ ట్యాగ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ కోరుకున్నప్పుడే పెళ్లి చేస్తామంటూ ఆమె తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. అయితే త‌న పెళ్లికి సంబంధించిన ఎన్ని పుకార్లు వచ్చినా కీర్తి మాత్రం స్పందించ‌డం లేదు. రీసెంట్‌గా మాత్రం ఇంస్టాగ్రామ్ ఛాట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ ని ఓ అభిమాని పెళ్లి ఎప్పుడని అడ‌గ‌డంతో ఆ ప్రశ్నకు కమెడియన్ వడివేలుతో కూడిన ఓ ఫన్నీ జిఫ్ ని షేర్ చేసింది. దీనికి అర్థమేంటో తెలీక జనాలు సతమతమవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here