Keerthy Suresh స్టార్ హీరో కొడుకుతో కీర్తి సురేష్ ప్రేమాయణం..కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసిన మహానటి!

- Advertisement -
Keerthy Suresh సౌత్ ఇండియాలో అందంతో పాటుగా అద్భుతమైన నటన కనబర్చే హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అందుకే అందం ఉన్న హీరోయిన్ల కంటే, టాలెంట్ ఉన్న హీరోయిన్లే ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్. బాలనటిగా మలయాళం లో పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ని దక్కించుకున్న ఈమె, మలయాళం లోనే హీరోయిన్ గా కూడా తన మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం లో పలు సినిమాలు చేసిన ఆమెకి కెరీర్ ప్రారంభంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కింది. ముఖ్యంగా మహానటి చిత్రంలో ఆమె నటించిన అద్భుతమైన నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది.
Keerthy Suresh
Keerthy Suresh

అలా ఎక్కువగా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ వస్తుంది కీర్తి సురేష్. రీసెంట్ గా ఆమె ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలోని బుజ్జి క్యారక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన బాయ్ ఫ్రెండ్ ఎవరో అందరికీ పరిచయం చేసింది. అసలు విషయానికి వస్తే కీర్తి సురేష్ టాలీవుడ్ లో అత్యంత సన్నిహితంగా ఉండే హీరోలలో ఒకరు న్యాచురల్ స్టార్ నాని. ఇతనితో కలిసి కీర్తి సురేష్ నేను లోకల్, దసరా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా నాని రేంజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.

Nani to romance Keerthy Suresh ?

ఈ సినిమాల షూటింగ్ సమయం లోనే కీర్తి సురేష్ , నాని మధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడిందని, నాని కుటుంబం లో ఒక సభ్యురాలిగా కీర్తి సురేష్ మారిపోయిందని అంటుంటారు. అయితే ఆమె మాట్లాడుతూ ‘ నాని కొడుకు జున్ను అంటే నాకు చాలా ఇష్టం. అతను నా బాయ్ ఫ్రెండ్. నా పుట్టినరోజు నాడు జున్ను చెప్పిన శుభాకాంక్షలు స్టైల్ చూస్తే ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది. కిట్టి అత్త హ్యాపీ బర్త్ డే అంటూ వచ్చీ రాని మాటలతో వాడు పెట్టిన వాయిస్ మెసేజిలు ఎంతో క్యూట్ గా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

- Advertisement -

Nani-Keerthy Suresh : మహానటితో కలిసి నాని దసరా సెట్ లో ఏం చేస్తున్నాడో చూడండి.. | Nani and keerthy suresh playing shuttle in dasara movie sets while shot gap-10TV Telugu

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here