Keerthy Suresh మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దసరా సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న బ్యూటీ కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది. దసరా సినిమా తర్వాత కీర్తి చేసిన ఫస్ట్ పోస్టు ఆ సినిమా ప్రమోషన్స్‌లో తన లుక్ గురించే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రబృందం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, ముంబయి.. ఇలా పలు నగరాలకు వెళ్లారు. ఈ చిత్ర ప్రచారం కోసం కీర్తి ట్రెడిషనల్ లుక్‌ను ఎంచుకుంది. అందుకే ఎక్కువగా చీరకట్టులోనే కనిపించింది.

దసరా మూవీ ప్రమోషన్స్‌లో తనకు బాగా నచ్చిన తన అట్టైర్ గురించి సోషల్ మీడియాలో కీర్తి తాజాగా పోస్టు చేసింది. ‘దసరా సినిమా ప్రమోషన్స్‌లో నాకు బాగా నచ్చిన లుక్’ అంటూ కీర్తి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో కీర్తి చాక్లెట్ కలర్ శారీలో కనిపించింది. చీరకట్టులో కీర్తి చాలా అందంగా కనిపిస్తోంది. కాటుక కళ్లతో.. మత్తెక్కించే చూపులతో ఈ బ్యూటీ మెస్మరైజ్ చేసింది. నడుం అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. కవ్వించే పోజులతో.. క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కీర్తి లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చీరకట్టులో కీర్తి స్టన్నింగ్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాటుక కళ్లను చూస్తే పోతుందే మతి పోతుందే అంటూ పాటలు పాడుకుంటున్నారు. లవ్యూ కీర్తి అంటూ తమ ప్రేమను కురిపిస్తున్నారు. దసరా సినిమాలో డీ గ్లామర్ లుక్‌లో కనిపించిన కీర్తిని గుర్తు చేసుకుంటూ.. విత్ ఆర్ వితౌట్ మేకప్.. ఎలాగైనా కీర్తి అందంగానే కనిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక దసరా మూవీ ఇచ్చిన కిక్‌తో కీర్తి సురేష్ తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కీర్తికి దసరా బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సక్సెస్ సాధించింది. మిగతా భాషల్లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి కీర్తి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ సక్సెస్‌ను కంటిన్యూ చేస్తుందా లేదా చూడాలి.