Keerthy Suresh : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోనే గా ఎదిగిన వాళ్లలో ఒకరు కీర్తి సురేష్. మలయాళం లో పలు సినిమాల్లో బాలనటిగా మెప్పించి. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె, తెలుగు ఆడియన్స్ కి ‘నేను శైలజ’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. తొలిసినిమానే సూపర్ హిట్ అవ్వడం తో కీర్తి సురేష్ కి కేవలం టాలీవుడ్ లోనే కాదు, సౌత్ మొత్తం ఆఫర్ల వెల్లువ కురిసింది.

అలా సౌత్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈమె ప్రధాన పాత్రలో కనిపించిన ‘మహానటి’ చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో మన అందరం చూసాము. ఈ సినిమాలో అద్భుతంగా నటించినందుకు గాను ఆమెకి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉండే కీర్తి సురేష్ రీసెంట్ గా ఒక వీరాభిమాని తగిలాడు. ట్విట్టర్ లో కృష్ణ అనే అభిమాని కీర్తి సురేష్ రిప్లై ఇచ్చేంత వరకు ఆమెని ట్యాగ్ చేసి ట్వీట్స్ వేస్తూనే ఉంటాను అని చెప్పి డే 1,డే 2 , డే 3 అంటూ 234 వ రోజు వరకు ఆమెని ట్యాగ్ చేసి ట్వీట్స్ వేస్తూనే ఉన్నాడు.

ఎట్టకేలకు ఇది గమనించిన కీర్తి సురేష్ కృష్ణ కి రిప్లై ఇస్తూ ‘234 మంచి ఫ్యాన్సీ నెంబర్ కదా.. నా రిప్లై కోసం మీరు ఇన్ని రోజులు ఎదురు చూసారు, దయచేసి నన్ను క్షమించండి, లవ్ యూ’ అంటూ రిప్లై ఇచ్చింది. మొత్తానికి తన కోరిక నెరవేరినందుకు కృష్ణ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. తన ఆనందాన్ని పంచుకుంటూ మళ్ళీ ప్రత్యేకంగా పోస్టు చెయ్యగా, నెటిజెన్స్ ఆయనకి కంగ్రాట్స్ చెప్తూ అభినందించారు.
