Keerthi Suresh : కీర్తి సురేష్ పెళ్లి చేసుకుందా.. వధువుగా కనిపించి షాక్ ఇచ్చిందిగా

- Advertisement -

Keerthi Suresh సినీ ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరోయిన్లు పెళ్లి గురించి ఆలోచించే వారు కాదు. మేల్ డామినేషన్ ఉన్న సినీ పరిశ్రమలో, హీరోలు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, వాళ్ళ స్టార్ స్టేటస్ కు వచ్చే నష్టమేమి ఉండదు. కానీ హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కితే మాత్రం, వారికి హీరోయిన్ చాన్సులు పూర్తిగా తగ్గిపోయేవి. దీంతో సీనియర్స్ హీరోయిన్స్ పెళ్ళిళ్ళు చాలా లేట్ గా అయ్యేవి. అయితే ఇప్పుడు రోజులు మారాయి. నేటి హీరోయిన్ల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. మోడ్రన్ జమానాలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకుని, మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Keerthi Suresh
Keerthi Suresh

తాజాగా మహానటి కీర్తిసురేశ్ పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. కీర్తి నిజంగానే ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ మ్యారెజ్ చేసుకుందా అనుకున్నారంతా. పాపం కీర్తిని క్రష్ గా ఊహించుకునే వాళ్లకు మినీ హాట్ ఎటాకే వచ్చింది. దీంతో ఆమె ఫొటోలకు కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. అయితే తర్వాత హాట్ గా తెలిసిన స్వీట్ న్యూస్ ఏంటంటే ఆ ఫొటోస్ ఒక నగల దుకాణం ప్రకటన కోసం దిగినవి అని తెలిసింది. ఈ ఫొటోల్లో ట్రెడిషినల్ లుక్‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది కీర్తి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.దీంతో కీర్తిని ఆరాదించే వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

Actress Keerthi suresh
Actress Keerthi suresh

ప్రస్తుతం కీర్తి ఫుల్‌ జోష్‌లో ఉంది. నానితో కలిసి ఆమె నటించిన దసరా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దసరా సినిమాలో కీర్తి పోషించిన వెన్నెల పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తదుపరి సినిమా షూటింగ్‌లకు రెడీ అవుతోందీ అందాల తార.చిరంజీవి భోళా శంకర్‌ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటిస్తోంది . అలాగే మామన్నన్‌, రివాల్వర్‌ రాణి, సైరన్‌ తదితర సినిమాలకూ ఓకే చెప్పింది. వీటితో పాటు పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here